venkat

venkat
needs You

Thursday, October 20, 2011

Aadolla prema o neeti moota...



అమ్మా...అమ్మా  కన్నె పువ్వమ్మా, నన్ను నువ్వే విడిచి పోయావేలమ్మా,, గుండెల్లోని గాయం చూడమ్మా నా మానం ప్రాణం నీవేనోయమ్మా 
అరె ఆడోల్ల ప్రేమ ఓ నీటి మూట మగవాడి ప్రేమ ఓ రాతి గోడ..
కలలోనైనా నిన్నే తలిచేనే ఆ కలలే రాక మూగైపోయానే, పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే నా శ్వాసను  నువ్వే పట్టుకుపోయావే 
మగువను నమ్మి చెడిపోయినోళ్ళు లక్ష , ఆ వరుసన నిలిపి నాకు వేసినావు శిక్ష,
పాము కాటువేస్తే మన ఊపిరాగుతుందే, కన్నె ప్రేమ కుట్టేనంటే ప్రతి రోజు చంపుతుందే 
అరె చెయ్యి విడిచి నువ్వు పోయాక గుండె మూగదైపోయింది, నిన్ను నమ్మి నీ వెనకొస్తే  మనసంతా ఓ పుండైనాది ..
వలపంటే ఓ ముళ్ళ బాటరా అటు నడిచావంటే ఆశే తీరదయా ,,,,వలపంటే ఓ మత్తుమందురా  అది వేసావంటే ప్రాణం దక్కదురా ..

చిల్లులున్న  మురళి అరె పాత పాడగలదు , గుండె గాయం ఎంతదైన బాస మరచిపోదు ..
ప్రేమ ఉన్నవారు మది వీడివెళ్ళలేరు , నమ్మి మోసపోతి నేడు ఇదీ చెప్పలేని గోడు 
నను నీట ముంచి నువ్వు వెళ్ళోద్దే  , ఎదుట నిలిచి నను చంపోద్దే 
కంటి చూపులే కరువైతే మరు క్షణమే  నే మనలేనే ..
వన్నెలు చిలికే రామ చిలకమ్మా ...ఎద గూటిని దాటి పోయావేలమ్మా 
ప్రేమే లేని గూడే యాడున్నా నా కళ్ళే మూసి తీసుకుపోవమ్మా..

అమ్మా...నా కన్నె పువ్వమ్మా, నన్ను నువ్వే విడిచి పోయావేలమ్మా,, గుండెల్లోని గాయం చూడమ్మా నా మానం ప్రాణం నీవేనోయమ్మా 
అరె ఆడోల్ల ప్రేమ ఓ నీటి మూట మగవాడి ప్రేమ ఓ రాతి గోడ..
కలలోనైనా నిన్నే తలిచేనే ఆ కలలే రాక మూగైపోయానే, పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే నా శ్వాసను  నువ్వే పట్టుకుపోయావే 

Saturday, September 24, 2011


గుండె గొంతులో ఆగిపోయింది మాటలే తోచక, కంట కన్నీరు చెంప తడిమింది బాధనోదార్చగా ..
మనసుకేనాడో మనసుతో మనువు జరిగిపోయిందిగా..కాలం ఈనాడు కాదు పొమ్మంటే ఊరుకోలేదుగా..
మనం అన్న ఒకమాట నువ్వు-నేనుగా వేరు కాలేదుగా..
గుండె గొంతులో ఆగిపోయింది మాటలే తోచక, కంట కన్నీరు చెంప తడిమింది బాధనోదార్చగా..
ఆట నిజం..మాట నిజం..ఆడుకుంది ఆ దైవం ..ఆడకనే తగిలిందా ఈ గాయం ..
బాధ  నిజం..బరువు నిజం...దాచలేదుగా హృదయం..తేలికగా తెగదు కదా అనుబంధం..
త్యాగమే సాయమై ఊరడించినా ...ప్రేమకే దూరమై ప్రాణమాగునా..ఊహకే రాని మలుపులు గెలిచే గెలుపు  కనిపించునా ..
కంటతడే లేదు అనే కానరాని బరువేనా..ఒంటరిగా దిగులునువే మోయాలా..
ఎడబాటే అలవాటై ఎటోవైపు నడవాలా ...ఎదమంటే దీపంలా మిగలాల ...
రాయిలా మారిన రామచంద్రుడా ..సీతలో చింతనే చూడవేమిరా ..
కనులు తెరిచి నువ్వు చూడకపోతే కలత తీరేదెలా..

Thursday, September 22, 2011



నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో, నీవేనాడో మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ  గీతిని..
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో, నీవేనాడో మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ  గీతిని..
ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ..
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది ..చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది 
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా?
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధనా నీకు ఈనాడు తెలిపేది నా వేదన..
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా?
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధనా నీకు ఈనాడు తెలిపేది నా వేదన..
ఇదే నిన్ను వినమని నన్ను ఇదే నిజం అనమని ..
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ...చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది.

Tuesday, September 6, 2011

Ammayi...

అందమైన నా ఊహలమేడకు ఆవిడ మణిదీపం ..
అందీ అందని ఆ ఆశలకు ఆమే ప్రతిరూపం...
ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం...
మల్లెపూల  కన్నా  మంచు పొరల కన్నా నా చెలి ముసి ముసి నవ్వులు అందం..
నెమలి హోయల కన్నా సెలయేటి లయల కన్నా నా చెలి జిలిబిలి నడకలు అందం..
అపురూపం ఆ నవలావణ్యం ..అపురూపం ఆ నవలావణ్యం అది నా మదిలో చెరగని స్వప్నం ..

Saturday, July 2, 2011

వేయి జన్మాల చెలిమి నీవే



వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ..
కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికీ..
నిను దాచే ఈ నిశీ ...నిలిచేనా ప్రేయసీ...
నలువైపులా నల్లని చీకట్లే ఎదురోస్తూ ఉన్నా 
పరుగాగని పాదం  దూరంతో పోరాడుతూ ఉన్నా 
కనుపాపకి ముప్పని కన్నీరే తెరవేస్తూ ఉన్నా ..
ప్రతినిమిషం నీవైపే పయనిస్తూ ఉన్నా...
గాలితో నువు పంపిన వలపు ఊసేమిటో...
పూలలో నువు నింపిన తీపి తలపేమిటో...
నిన్ను నా కలను చేరలేదని నమ్మడా చెలి నీ మౌనం..
నా శ్వాసతో రగిలి గాలులతో నిను వెతికిస్తున్నా ..
నా ప్రేమకి పూల సువాసనతో నీకందిస్తున్నా...
ఎదసవ్వడులే ఆ గువ్వలుగా ఎగరేస్తూఉన్నా..
వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ...
ఆశగా ఉంది నిచ్చెలీ ...కలుసుకోవాలనీ...ఈ
కోవెలై ఉంది కౌగిలీ ...దేవి రావాలనీ...ఈ
నీవు కలవని కలవు కావనీ రుజువుచేయనీ అనురాగం ...
నను నేనే శిలగా మోస్తూ ఉన్నా ఎద  బరువైపోగా ...
చిరునవ్వులనే వెలివేస్తూ ఉన్నా నిను చూసేదాకా...
ప్రతి రక్తకణం వెలిగిస్తూ ఉన్నా పెనుజ్వాలై పోగా..
ఎడబాటు పొరబాటు కలిగించేదాకా..
వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ...
కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికీ...

Friday, June 3, 2011

మనసంతా ముక్కలు చేసి

మనసంతా ముక్కలు చేసి పక్కకు వెల్తావెందుకు  ఓ  నేస్తం...
ఊరించి ఊహలు  పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం...
నీకై నీకై ప్రానాలిస్తానన్నా ఇంకా ఇంకా అలుసైపోతున్నానా..
పొరపాటుంటే మన్నించవే....

విరిసిన పువ్వుల కొమ్మ తను పెనవేసిన ఒక రెమ్మ ఎవరో తె౦చేస్తూ  ఉంటే ఒప్పుకుంటదా..
బుడి బుడి అడుగుల పాపైనా తను ఆడుకునేదొక బొమ్మైనా ఎవరో లాగేసుకుంటే ఊరుకుంటదా..
నువ్వు నచ్చి మనసిచ్చి ఇపుడిక్కడే ఇదీ చూస్తుంటే కనుపాపల్లో కునుకు౦డదే...

వెలుతురు ఉన్నపుడేగా నీ వెనకన ఉంటది నీడ ఉంటా నడిరాతిరైన నీకు తోడుగా...
చిగురులు ఉన్నపుడేగా ఆ కుహు కుహు కోయిల పాత అవుతా నీ గుండెలయగా అన్నివేళలా ...
నిను కోరా ఇటు చేరా నువ్వు ఎటువైపో అడుగేస్తే యదలోతుల్లో కుదురు౦డదే ......

మనసంతా ముక్కలు చేసి పక్కకు వెల్తావెందుకు  ఓ  నేస్తం...
ఊరించి ఊహలు  పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం...
నీకై నీకై ప్రానాలిస్తానన్నా  ఇంకా ఇంకా అలుసైపోతున్నానా..
పొరపాటుంటే  మన్నించవే....

Monday, May 2, 2011

చందమామలాంటి రూపం ... సిరిమల్లె లాంటి నవ్వు


 

చందమామలాంటి రూపం ... సిరిమల్లె లాంటి నవ్వు...
తేనెలూరు నీ పలుకులు ...
కలకాలం నీ స్నేహం...
    నాలో కురిపించెను  జడివాన ,,,,,
 నీ ఆలోచనలే నాలో పొంగే అలలు ....
 మంచులో ముత్యమా....   కదిలే వెన్నెల శిల్పమా...కవులకే అందని అందమైన భావమా....
ఈ మాటే గుండెల్లో రాస్తానే ఈవేళ ,,,,
కష్టాన్నే నవ్వుతో దాస్తానే ఏదోలా
లోకాలన్నీ  చిన్నంగా నన్నే చూస్తున్నా 
ఆకాసంలో నిన్నింకా ఊరేగిస్తాగా .....
నీ రూపం నా హృదయంలో పదిలం అది నిలిచెను కలకాలం ....
గడచిన గతమే చెదిరే క్షణము వరకు నిదరోదమ్మా...

Tuesday, April 12, 2011

నిన్ను ఆరాధించడమే పాపమా?


ఎన్నో కలలు ఎన్నో ఆశలు ..నువ్వే నేనని నేనే నువ్వని నా ఆశకు శ్వాసవు నీవని
 నా కంటిపాపవు నువ్వే అని నా హృదయ స్పందన నీవని నువ్వు లేని నేను ఒక రాయినని విలువలేని శిలనని 
నీ నవ్వు నవవసంతమని  నీవు లేని నాడు నాకొక అమావాస్య అని ఉన్నంత కాలం నీతోనే ఉండాలని 
నీ నీడగా కలకాలం నీతోడుగా ఉండాలని
 ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా నువ్వే నా శక్తిగా అనుకొని
 కష్టాలను ఇష్టంగా కలతలను ప్రీతితో జయించి నువ్వు అనే నా లక్ష్యానికి చేరుకోవాలని 
నీ సంతోషమే నా ఆనందంగా కష్టాన్ని నీ చెంత చేరకుండా చూసే నేస్తంగా 
నీ ప్రతి కదలికలో తోడుగా ఉండాలని ..
జీవితమంటే ఇదేనా? ఎవరు నన్ను ఇష్టపడరా?
నేను ఎవరిని ఇష్టపడినా దూరమవ్వటం  మాత్రమేనా?
నాకంటూ సంతోషాలు లేవా? ఇంకెపుడు రావా?
నా జీవితం మొత్తం ఇంతేనా?
ఎప్పుడు నాకు బాధలేనా?
నేను ఎవరికీ ఏమి కాలేనా?
అందరికి నేనంటే అసహ్యం మాత్రమే ఉంటుందా ?
ఆనందంగా ఉండే అదృష్టం నాకు లేదా? నేను నిన్ను ఇష్టపడటమే నేరమా ? నిన్ను ఆరాధించడమే పాపమా? ...
నా దేవత నువ్వనుకోవడమే నా తప్పా.....?

Friday, April 8, 2011

Priya nestama...

















పుష్పించానన్న  విరికి  తుమ్మెదను అవుతానన్నావు  ..!!
నేలరాలనన్న  జల్లుకి  హరివిల్లౌతానన్నావు ..!!
నింగి  వీడని  చీకటికి  వెన్నేలౌతానన్నావు ...!!
నిద్దుర  ఎరుగని  కలకి  వాస్తమౌతానన్నావు ..!!
నీడగా  మరుజన్మకు  కూడా  తోడు అవుతానన్నావు ....!!

వీడలేనన్నావ్  మరిచితివా ??
... ప్రియ  నేస్తమా ...!!


పుష్పించకుండానే  పువ్వు  నేల రాలుతానంటుంది ...!!
నేలరాలానన్న  జల్లు  బీడుగా  మారుతానంటుంది...!!
మారి  పోనీ  చీకటి  వేకువ  ఇంకా  రాదంటుంది..!!
రాదనుకున్న  నిదుర  కలలాగే  మిగిలిపోతానంటుంది...!!
మిగిలిపోతున్న  బాసలతో  ఊపిరి  వదిలేస్తానంటుంది..!!

మరుజన్మలో  తీరుస్తావా ?
....వీడుకోలు  ప్రియతమా .!!

Tuesday, March 29, 2011

ప్రియసఖి

దేవతల్లే  వరములిస్తివే  నిను  చేరకుండా దూరమైతినే ,,,
ఎపుడు ఎదలో చేరెనో చెలి నేనదగకుండా మనసు ఇచ్చేలే...
చివరివరకు ,... మరువలేను ...ప్రియసఖివే కనబడవే ...
ఓర్వలేని ఓరి దేవుడా ....మా మౌనరాగం వినిపించదా...
గాయపడిన మనసు చూడరా ...మా గీత  కాస్త  మార్చి రాయవా..

నీజ్ఞాపకలేమో వెంటాడుతుంటే ఎన్నెన్నో అందాలు విరబూసెనే...
నీ నవ్వులే నను వీడి వెలుతువుంటే వికసించే అందాలు  ఏమాయెనే ...
ఎంత చిత్రమే చెలీ ఇదివరకిది తెలియదే ఏమి మంత్రమో మరి నను వీడనిదే...

నీతోడు ఉంటె ఏ లక్ష్యమైన సులువే ..నిని చేరకుంటే నా ప్రాణమైన బరువే ..
చెలియా తలపులో ఎన్నెన్ని ఊహలో చెలియా చెలిమిలో ఎన్నెన్ని ఆశలో...

నీలాల కనుపాప నిను వెతుకుతు ఉంటే హరివిల్లు నీ జాడ నను కోరెనే ...
నీ రూపు రేఖల్ని వివరించమంటూ  వెంటాడి నన్నేమో వేధించేనే...

నీవులేనిదే చెలీ నా బ్రతుకిక శూన్యమే...
నీవు నన్ను  చేరితే మరణము సుఖమే 
నా గుండె గుడిలోనే నీ దివ్వె కొలువు ...నా పంచప్రాణాలు నీలోన కలవు ..
ఎదలగడపలో  ఎదురుచూపులు ..కనుల కొలనులో కన్నీటి కలువలు...

దేవతల్లే వరములిస్తివే నిను చేరకుండా దూరమైతినే...

Saturday, March 12, 2011

బంగారు వల....



పచ్చా  పచ్చాని  కల  వేసే  బంగారు  వల  ప్రేమంటే …
పచ్చ  పచ్చాని  కల  వేసే  బంగారు  వల  ప్రేమంటే …

అడిఆసే  అయ్యేనే  ఊహల్లొ సాగేనే  ఏకాంతం  వెంటాడుతూ  వేటాడేనే…
ఒట్టులెన్నో వేశావే   గాలిలోన  కలిపావే , ఆశలన్నీ చూపించి  నా  కళ్ళు  రెండు  మూశావే,,,


ఒట్టులెన్నో  వేశావే   గాలిలోన  కలిపావే , ఆశలన్నీ  చూపించి  నా  కళ్ళు  రెండు  మూశావే 
కన్నా  కలలో  ఉదయాలే  దోచి  కనుమరుగై  తేలవారేనే 
ఒక్క  క్షణమే  లక్షపూలై  పూసి  ,నన్ను  విడిచి  కథ  మారెనే ,,,
విధిరాతకు  కర్తెవ్వరు  నేనే  నేనే …

పచ్చా  పచ్చాని  కల  వేసే  బంగారు  వల  ప్రేమంటే …
పచ్చా  పచ్చాని  కల  వేసే  బంగారు  వల  ప్రేమంటే …
కోరుకున్న  గాయమిది , ఊరడింపు  పొందనిదీ
రాలుతున్న  పూత  ఇదీ ,తోడులేని  మోడు   ఇదీ,
కోరుకున్న  గాయమిడీ  ఊరడింపు  పొందనిదీ 

రాలుతున్న  పూత  ఇదీ ,తోడులేని     మోడు  ఇదీ ,,,
గుండె రగిలే   వడగాలి సెగలు  కంటితడితో ఇక  ఆరేనా 
పోద్దుపోడుపే  కనలేదీ  ప్రాయం  కునుకేది  నడి  రేయయినా 
నా  దారిలో  నాకెవ్వరు  లేనే  లేరే ,,,,,

పచ్చా   పచ్చాని  కల  వేసే  బంగారు  వల  ప్రేమంటే …
పచ్చా  పచ్చాని  కల  వేసే  బంగారు  వల  ప్రేమంటే …
అడిఆశే  అయ్యేనే  ఉహల్లో  సాగేనే  ఏకాంతం  వెంటాడుతూ  
వేటాడేనే
  …



Saturday, February 12, 2011

Nannodili velloddu....

కలలను అలలు అన్నావు నువ్వు తీరం చేరగానే నన్ను మాత్రం సుడిగుండంలో తోసేసావు ...
రంగుల ప్రపంచం నీకిష్టం అన్నావు, అడిగినదే ఆలస్యమని రెక్కలు కట్టుకెళ్ళి ఇంద్రధనస్సులోని రంగులు తెచ్చి
 నీ ముంగిట నిలిపెలోగానే నన్ను రంగులు కలిపే సిరా మాత్రమే అన్నావు..
కారు చీకటి నా జీవితంలో రాకుండా చూసే వెలుగు నువ్వవుతావని ఆశ పడ్డాను ,
కానీ జీవితం అంతా అంధకారం చేసి వెల్తావనుకోలేదు.... 
నువ్వు నాదానివి కాదని తెలిసిన క్షణాన నా హృదయంలో ఉన్న బాధ ఒక్కసారిగా బద్దలయిన అగ్ని పర్వతంలా కన్నీటి లావాను వెదజల్లింది...
నిన్ను ఎలాగయినా చేరుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు నన్ను శూన్యం అన్నరోజునుంచి నిన్ను చేరుకునే దారిలేక ఏ ఆధారం లేని వాడినయ్యాను...
నామీద నీకు ప్రేమ అనే ఆధారం లేనంతకాలం నాకంతా శూన్యం...
ఇంత జరిగినా నీమీద నాకున్న ప్రేమ అనన్యం,అనితర సాధ్యం...
నా ఆశకు శ్వాసవు  నువ్వై ,భవితకు వేలుగుదివ్వేవై జీవితాంతం ఎవ్వరితోను అవమానం పొందకుండా నీ రంగుల ప్రపంచంలో ఆనన్న్డంగా ఉండాలని,
కలలోను,ఇలలోనూ నీ రాకకై ఎదురుచూసే....
                                                                                                                                   నీ..

Monday, January 24, 2011

feel when U get this.....

అనురాగం అన్నది అందమైనది మమకారం ఉన్నది మధురముగా ....
కన్నులు చూడని అందమేల మమతలేని మధురమేల .....
మనసున ఉన్నది చెప్పలేని బాధ కాని అది పంచుకోలేక నేను  పడుతున్నా వ్యధ ..
చిన్న ఆశలనే ఆశించాను కానీ అది తీరదని తెలిసిన నా మనసు భరించలేకున్నది
ఇది తీరెదేనాడో నేను కోరుకున్న కోరిక నెరవేరేది ఎప్పుడో అని నా కళ్ళు క్షణం ఒక యుగంలా ప్రతి నిమిషం ఒక మరణంగా అంతులేని దారివైపు ఆశగా చూస్తున్నాయి ....
తను వదిలి వెళ్ళిన నన్ను నేనే తనకు అంకితం ఇవ్వాలని అనుకున్న కానీ స్నేహం అనే సంజీవని నన్ను మనిషిని చేసి మమతను పంచుతోంది ఇది లభించిన నేను ధన్యజీవిని ....నా స్నేహం చిరంజీవి అని చెప్పడానికి సగర్వంగా భావిస్తున్నా...
ప్రతి స్నేహం ఒక మధురానుభూతిని మిగిల్చింది ....