ఎన్నో కలలు ఎన్నో ఆశలు ..నువ్వే నేనని నేనే నువ్వని నా ఆశకు శ్వాసవు నీవని
నా కంటిపాపవు నువ్వే అని నా హృదయ స్పందన నీవని నువ్వు లేని నేను ఒక రాయినని విలువలేని శిలనని
నీ నవ్వు నవవసంతమని నీవు లేని నాడు నాకొక అమావాస్య అని ఉన్నంత కాలం నీతోనే ఉండాలని
నీ నీడగా కలకాలం నీతోడుగా ఉండాలని
ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా నువ్వే నా శక్తిగా అనుకొని
కష్టాలను ఇష్టంగా కలతలను ప్రీతితో జయించి నువ్వు అనే నా లక్ష్యానికి చేరుకోవాలని
నీ సంతోషమే నా ఆనందంగా కష్టాన్ని నీ చెంత చేరకుండా చూసే నేస్తంగా
నీ ప్రతి కదలికలో తోడుగా ఉండాలని ..
జీవితమంటే ఇదేనా? ఎవరు నన్ను ఇష్టపడరా?
నేను ఎవరిని ఇష్టపడినా దూరమవ్వటం మాత్రమేనా?
నాకంటూ సంతోషాలు లేవా? ఇంకెపుడు రావా?
నా జీవితం మొత్తం ఇంతేనా?
ఎప్పుడు నాకు బాధలేనా?
నేను ఎవరికీ ఏమి కాలేనా?
అందరికి నేనంటే అసహ్యం మాత్రమే ఉంటుందా ?
ఆనందంగా ఉండే అదృష్టం నాకు లేదా? నేను నిన్ను ఇష్టపడటమే నేరమా ? నిన్ను ఆరాధించడమే పాపమా? ...
నా దేవత నువ్వనుకోవడమే నా తప్పా.....?

No comments:
Post a Comment