venkat

venkat
needs You

Saturday, July 2, 2011

వేయి జన్మాల చెలిమి నీవే



వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ..
కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికీ..
నిను దాచే ఈ నిశీ ...నిలిచేనా ప్రేయసీ...
నలువైపులా నల్లని చీకట్లే ఎదురోస్తూ ఉన్నా 
పరుగాగని పాదం  దూరంతో పోరాడుతూ ఉన్నా 
కనుపాపకి ముప్పని కన్నీరే తెరవేస్తూ ఉన్నా ..
ప్రతినిమిషం నీవైపే పయనిస్తూ ఉన్నా...
గాలితో నువు పంపిన వలపు ఊసేమిటో...
పూలలో నువు నింపిన తీపి తలపేమిటో...
నిన్ను నా కలను చేరలేదని నమ్మడా చెలి నీ మౌనం..
నా శ్వాసతో రగిలి గాలులతో నిను వెతికిస్తున్నా ..
నా ప్రేమకి పూల సువాసనతో నీకందిస్తున్నా...
ఎదసవ్వడులే ఆ గువ్వలుగా ఎగరేస్తూఉన్నా..
వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ...
ఆశగా ఉంది నిచ్చెలీ ...కలుసుకోవాలనీ...ఈ
కోవెలై ఉంది కౌగిలీ ...దేవి రావాలనీ...ఈ
నీవు కలవని కలవు కావనీ రుజువుచేయనీ అనురాగం ...
నను నేనే శిలగా మోస్తూ ఉన్నా ఎద  బరువైపోగా ...
చిరునవ్వులనే వెలివేస్తూ ఉన్నా నిను చూసేదాకా...
ప్రతి రక్తకణం వెలిగిస్తూ ఉన్నా పెనుజ్వాలై పోగా..
ఎడబాటు పొరబాటు కలిగించేదాకా..
వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ...
కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికీ...

No comments: