venkat

venkat
needs You

Thursday, September 30, 2010

మన సమాజం



భవితకు పునాదులు వేయాలని మనమెన్నో అనుకుంటాము ఆయినా అవి నేరవేర్చుకునేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు .....
ఒక మేధావి చెప్పినట్లు మనము "కలలు కనాలి ఆ కలలను నిజం చేసుకోవాలి"  ఈ మాటలు అందరు ఆచరణలో పెట్టి ఉంటే భావి భారతంలో ఎందరో మోక్షగుండం విశ్వేశ్వరయ్య లు ఉండేవాళ్ళు ,,,,,,,
కాని మన సమాజంలో ఉన్న పరిస్థితుల ప్రకారం ఒక శతాబ్దికి ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య మాత్రమే పుడతాడు ఎందుకంటే ప్రతి పనిలోనూ అవినీతి అనేది ప్రత్యక్ష మహిషాసుర వేషంలో విలయతాండవం చేస్తోంది .....
                     ప్రజలలో ప్రతిదానికి భయాన్ని కలిగించే ఈ మహమ్మారిని ఏ దేవుడు వచ్చిన అంతం చేయలేడు ఎందుకంటే భగవంతుడికి కూడా లంచం ఇచ్చి కొనేయ్యాలనే అంతటి అవినీతి దుండగులు ఉన్నారు .....
ప్రతి మనిషిలోను మార్పు రావాలి మనమే మన సమాజాన్ని బంగారు బాటలో కాకపోయినా ముళ్ళ బాటలో మాత్రం నడవకుండా చేయాలని చిన్న విన్నపం నా విన్నప్పాన్ని మన్నిస్తారని ఆసిస్తూ ......
                                          అందరు కలకాలం సంతోషంగా  ఉండాలి...

Wednesday, September 29, 2010

Think once....మంచిమనసు

అందరిలో ఉండే ఆలోచనా జ్ఞానం రాను రాను నసించిపోతుందేమో అన్న సందేహం కలుగుతోంది ఎందుకంటే మానవుడికి భగవంతుడిచ్చిన అద్భుతమైన వరం క్షమించే గుణం.....
      ఒకరిని క్షమించే మనసులేని మనిషి తన జీవితాన్ని సార్ధకం చేసుకోలేడు ,,,,,
కనీసం మనిషిని మనిషిగా కూడా చూడలేకపోతున్న మన మా "నవసమాజం" లో ఎందరు దేవుళ్ళు దిగివచ్చినా మనలో పరివర్తన రాదు,,,,,,
                 ఎందుకంటే ఆ దేవుడు దిగివస్తే మనము అడిగే మొదటి ప్రశ్న "నువ్వు భగవంతుడని రుజువేంటి" అని .....

ఇది చదివే ప్రతి ఒక్కరికి నేను చేసే చిన్న విన్నపం ఒకటే మీరు అందరిని మార్చాల్సిన అవసరం లేదు మనలో ఉండే మంచిమనసుని వ్యక్తీకరించండి అంతే చాలు..


మనలోనే ఎందఱో మహానుభావులున్నారని ఆసిస్తూ మీ వెంకట్.....

Thursday, September 23, 2010

పదహారణాల తెలుగమ్మాయి

పదహారణాల తెలుగమ్మాయి....

కలువల్లాంటి కళ్ళు,
దొండపండులాంటి పెదవులు,
చేమంతుల్లాంటి చెక్కిలూ,
తుమ్మెద రెక్కల హోయల్లాంటి కురులు,
కళ్ళలో మెరిసే వెలుగు ఇంకా చురుకుదనం,
కొంచం సరదాగా,
మరికొంచెం సాంప్రదాయంగా,   కొంచం లక్షణంగా,

చాల గడుసుగా, చిలిపిగా.
అందంగా, ఆనందం మోమంత విరబూసి,
చెంగు చెంగున తుళ్ళుతూ, లంగావోని వేసుకుని వచ్చే.......
"16 అణాల తెలుగు అమ్మాయి" కి స్వాగతం

Wednesday, September 22, 2010

Andamina ammayi....

అందాన్ని ఆస్వాదించడానికి  ఎలాంటి ప్రత్యేకతలు ఉండాల్సిన అవసరం లేదని తెలియచేయడమే ఈ సందేసానుసారం
భాష తెలియని భావాలకు నిదర్శనం ఈ చిన్న దృశ్యం ...
సమ్మోహన రూపం ఉండటమే అమ్మాయిల అర్హత కాదు......
 ఆ అందాన్ని మరింత మనోహరంగా వర్ణించే హృదయం ఉండటమే అందం అదే ఆనందం...
చిన్ని కవితలకు మనసు పొంగితే అది పులకరింత ,,,,అది తెలియజేసే భాష భ్హవానికి అందని  మధురమైన  అనుభూతి ...