
గుండె గొంతులో ఆగిపోయింది మాటలే తోచక, కంట కన్నీరు చెంప తడిమింది బాధనోదార్చగా ..
మనసుకేనాడో మనసుతో మనువు జరిగిపోయిందిగా..కాలం ఈనాడు కాదు పొమ్మంటే ఊరుకోలేదుగా..
మనం అన్న ఒకమాట నువ్వు-నేనుగా వేరు కాలేదుగా..
గుండె గొంతులో ఆగిపోయింది మాటలే తోచక, కంట కన్నీరు చెంప తడిమింది బాధనోదార్చగా..
ఆట నిజం..మాట నిజం..ఆడుకుంది ఆ దైవం ..ఆడకనే తగిలిందా ఈ గాయం ..
బాధ నిజం..బరువు నిజం...దాచలేదుగా హృదయం..తేలికగా తెగదు కదా అనుబంధం..
త్యాగమే సాయమై ఊరడించినా ...ప్రేమకే దూరమై ప్రాణమాగునా..ఊహకే రాని మలుపులు గెలిచే గెలుపు కనిపించునా ..
కంటతడే లేదు అనే కానరాని బరువేనా..ఒంటరిగా దిగులునువే మోయాలా..
ఎడబాటే అలవాటై ఎటోవైపు నడవాలా ...ఎదమంటే దీపంలా మిగలాల ...
రాయిలా మారిన రామచంద్రుడా ..సీతలో చింతనే చూడవేమిరా ..
కనులు తెరిచి నువ్వు చూడకపోతే కలత తీరేదెలా..
No comments:
Post a Comment