నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో, నీవేనాడో మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని..

ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ..
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది ..చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా?
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధనా నీకు ఈనాడు తెలిపేది నా వేదన..

ఇదే నిన్ను వినమని నన్ను ఇదే నిజం అనమని ..
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ...చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది.

No comments:
Post a Comment