తన రూప౦ గొప్పది కాదంటా... తనలా ఎవ్వరు లేరంటా....
తన రంగూ గొప్పది కాదంటా .. తన సాటేవ్వరు రారంటా ....
తన రూప౦ గొప్పది కాదంటా ....తనలా ఎవ్వరు లేరంటా..
తను పెద్దగా చదువెం చదవదంటా...తన కదలికలే చదువుతుంటా ..
తను చిన్న కుక్కపిల్లనేం పెంచుకోదంట నేను వెనక వెళ్ళితే అడ్డుకోదంట....
తను బొమ్మల్ని వాటేసి నిద్రపోదంట నే బొమ్మై పుడితే బాగుండునంటా...
తన జడలెం బారెడు కాదంటా...ఆ ముడిలో హృదయం పడదంట....
చేగాజులు బంగారుకాదంట తన చేతిని వదలక నేనుంటా ...
తను కాక నాకు ఎవరంటా....జంట ఎవరంటా ...
తన రూపం గొప్పది కాదంటా ...తనలా ఎవ్వరు లేరంటా
తన రంగూ గొప్పది కాదంటా ...తన సాటేవ్వరు రారంటా..
తను పట్టుచీరలెం చుట్టుకోదంటా...తను చుడిడారుతో నా చుట్టమైన్దంట్ట.....
తను తిట్టేస్తుంటే బాధలేదంటా...ఆ మాటే నాకు దీవేనలంటా...
తనకంతం ఏది కాదంటా తను లేక ఊపిరి లేదంటా తన పంతం ఏది కాదంటా తను కాక నాకు ఎవరంటా
తను కాక నాకు ఎవరంటా సొంతం ఎవరంటా...
తన రూపం గొప్పది కాదంటా తనలా ఎవ్వరు లేరంటా ...
తన రంగూ గొప్పది కాదంటా తన సాటేవ్వరు రారంటా...
venkat
needs You
Friday, December 3, 2010
Thursday, December 2, 2010
ఒక అమ్మాయికోసం
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకడానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై వచ్చావే హో... ఓ....
ఎదచప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే...
నిప్పుల్లో వానై వచ్చావే ......
నీ పరువాన పూల్జల్లై కురిపించావే
నా మనసుని దోచి మాయలు చేసి మురిపించావే ....
నా మదిలోని భావనలకర్థంనీవే ....
బుగ్గల్లో విరిసేటి సిగ్గైనావే ....
నా లోకం చీకటికోన నువ్వొస్తే వెన్నెలవాన.....
ప్రతిరేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా ....
ఎండల్లో వెన్నెల తెచ్చావే హో ...ఓ
నిప్పుల్లో వానై వచ్చావే...
నీ తోడంటూ ఉండనినాడే జగమే శూన్యం...
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం...
నీ మురిపించే రాగాలితే మల్లెల దాహం ...
నా మదిలోన చిందులువేసే అల్లరి దాహం...
నీ జాడగా ఉంటేతప్ప నా నీడకు అర్థంలేదే ..
అంతకంటే వరమే ఏలా ప్రియా ....ప్రియా...
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకడానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై వచ్చావే హో... ఓ....
ఎదచప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే... నిప్పుల్లో వానై వచ్చావే ...... ....
Tuesday, October 26, 2010
మనసు పడ్డాను కానీ.....
మనసు పడ్డాను కానీ మన్నించదేమోనని ,,,,,
కలలు కన్నాను కానీ కరునించదేమోనని,,,,
గుండెల్లో గుబులాయె ఏలనో .....
మాటేమో దాగే ఏ మూలనో .....
కలలు కన్నాను కానీ కరునించదేమోనని,,,,
గుండెల్లో గుబులాయె ఏలనో .....
మాటేమో దాగే ఏ మూలనో .....
మనసు పడ్డాను కానీ మన్నించదేమోనని ,,,,,
కలలు కన్నాను కానీ కరునించదేమోనని.......
Saturday, October 2, 2010
భగ్న ప్రేమికుడు
కలువల్లాంటి నీ కళ్ళు చూసి నా భవితకు వేలుగునింపే జ్యోతివవుతావని,,,,,
చందమామ లాంటి నీ మోము చూసి నా జీవితానికి చెరగని గురుతువు అవుతావని ,,,,,
నువ్వు కోరితే రంగుల ప్రపంచాన్ని నీ ముందు నిలపాలని నిరంతరమూ అహర్నిశలు శ్రమించాను,,,,
నువ్వు ఆశగా అడిగావని అంబరాన్ని తాకేలా అంతస్తులు నిర్మించాను,,,,,,
ఎక్కడ కందిపోతావో అని పూలదారి నీకోసం పరిచాను....
నువ్వే ఆశగా, నీ ధ్యాసనే నా శ్వాసగా ప్రతినిముషం నీకోసమే అనుక్షణం నీ ధ్యానమే చేస్తూ గడిపాను,,,,,
రంగులలోకంలో నన్ను నిలుపుతావని ఎంతో ఆశగా ఎదురుచుసాను కాని నువ్ నన్ను రంగులు అద్దే సిరాగా మాత్రమే చూస్తావని కలలో కూడా ఉహించలేదు ......
నువ్వు మనసు తెలుసుకుంటావని ఎన్నోసార్లు ఎదురుచుసాను కానీ నువ్వు ఇష్టపడేది నన్ను కాదు నా చుట్టూ ఉన్న ఐస్వర్యంకోసమని తెలిసిన క్షణం నుంచి ఘడియ ఘడియను నరకంలాగ అనుభవిస్తున్నాను ఇంకా ఎన్నాళ్ళు నాకీ హృదయ వేదన .....
ఎప్పటికయినా నువ్వు నా మనసు తెలుసుకుని తిరిగోస్తావని క్షణమొక యుగంగా నిరీక్షిస్తున్నాను ,,,,,
నీ రాకకోసమే ఎదురు చూస్తూ ....... నీ భగ్న ప్రేమికుడు ,,,,,,,,,
Friday, October 1, 2010
Thursday, September 30, 2010
మన సమాజం
ఒక మేధావి చెప్పినట్లు మనము "కలలు కనాలి ఆ కలలను నిజం చేసుకోవాలి" ఈ మాటలు అందరు ఆచరణలో పెట్టి ఉంటే భావి భారతంలో ఎందరో మోక్షగుండం విశ్వేశ్వరయ్య లు ఉండేవాళ్ళు ,,,,,,,
కాని మన సమాజంలో ఉన్న పరిస్థితుల ప్రకారం ఒక శతాబ్దికి ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య మాత్రమే పుడతాడు ఎందుకంటే ప్రతి పనిలోనూ అవినీతి అనేది ప్రత్యక్ష మహిషాసుర వేషంలో విలయతాండవం చేస్తోంది .....
ప్రజలలో ప్రతిదానికి భయాన్ని కలిగించే ఈ మహమ్మారిని ఏ దేవుడు వచ్చిన అంతం చేయలేడు ఎందుకంటే భగవంతుడికి కూడా లంచం ఇచ్చి కొనేయ్యాలనే అంతటి అవినీతి దుండగులు ఉన్నారు .....
ప్రతి మనిషిలోను మార్పు రావాలి మనమే మన సమాజాన్ని బంగారు బాటలో కాకపోయినా ముళ్ళ బాటలో మాత్రం నడవకుండా చేయాలని చిన్న విన్నపం నా విన్నప్పాన్ని మన్నిస్తారని ఆసిస్తూ ......
అందరు కలకాలం సంతోషంగా ఉండాలి...
Wednesday, September 29, 2010
Think once....మంచిమనసు
అందరిలో ఉండే ఆలోచనా జ్ఞానం రాను రాను నసించిపోతుందేమో అన్న సందేహం కలుగుతోంది ఎందుకంటే మానవుడికి భగవంతుడిచ్చిన అద్భుతమైన వరం క్షమించే గుణం.....
ఒకరిని క్షమించే మనసులేని మనిషి తన జీవితాన్ని సార్ధకం చేసుకోలేడు ,,,,,
కనీసం మనిషిని మనిషిగా కూడా చూడలేకపోతున్న మన మా "నవసమాజం" లో ఎందరు దేవుళ్ళు దిగివచ్చినా మనలో పరివర్తన రాదు,,,,,,
ఎందుకంటే ఆ దేవుడు దిగివస్తే మనము అడిగే మొదటి ప్రశ్న "నువ్వు భగవంతుడని రుజువేంటి" అని .....
ఇది చదివే ప్రతి ఒక్కరికి నేను చేసే చిన్న విన్నపం ఒకటే మీరు అందరిని మార్చాల్సిన అవసరం లేదు మనలో ఉండే మంచిమనసుని వ్యక్తీకరించండి అంతే చాలు..
మనలోనే ఎందఱో మహానుభావులున్నారని ఆసిస్తూ మీ వెంకట్.....
ఒకరిని క్షమించే మనసులేని మనిషి తన జీవితాన్ని సార్ధకం చేసుకోలేడు ,,,,,
కనీసం మనిషిని మనిషిగా కూడా చూడలేకపోతున్న మన మా "నవసమాజం" లో ఎందరు దేవుళ్ళు దిగివచ్చినా మనలో పరివర్తన రాదు,,,,,,
ఎందుకంటే ఆ దేవుడు దిగివస్తే మనము అడిగే మొదటి ప్రశ్న "నువ్వు భగవంతుడని రుజువేంటి" అని .....
ఇది చదివే ప్రతి ఒక్కరికి నేను చేసే చిన్న విన్నపం ఒకటే మీరు అందరిని మార్చాల్సిన అవసరం లేదు మనలో ఉండే మంచిమనసుని వ్యక్తీకరించండి అంతే చాలు..
Thursday, September 23, 2010
పదహారణాల తెలుగమ్మాయి
పదహారణాల తెలుగమ్మాయి....
కలువల్లాంటి కళ్ళు,
దొండపండులాంటి పెదవులు,
చేమంతుల్లాంటి చెక్కిలూ,
తుమ్మెద రెక్కల హోయల్లాంటి కురులు,
కళ్ళలో మెరిసే వెలుగు ఇంకా చురుకుదనం,
కొంచం సరదాగా,
మరికొంచెం సాంప్రదాయంగా, కొంచం లక్షణంగా,
చాల గడుసుగా, చిలిపిగా.
అందంగా, ఆనందం మోమంత విరబూసి,
చెంగు చెంగున తుళ్ళుతూ, లంగావోని వేసుకుని వచ్చే.......
"16 అణాల తెలుగు అమ్మాయి" కి స్వాగతం
"16 అణాల తెలుగు అమ్మాయి" కి స్వాగతం
Wednesday, September 22, 2010
Andamina ammayi....
అందాన్ని ఆస్వాదించడానికి ఎలాంటి ప్రత్యేకతలు ఉండాల్సిన అవసరం లేదని తెలియచేయడమే ఈ సందేసానుసారం
భాష తెలియని భావాలకు నిదర్శనం ఈ చిన్న దృశ్యం ...
సమ్మోహన రూపం ఉండటమే అమ్మాయిల అర్హత కాదు......
ఆ అందాన్ని మరింత మనోహరంగా వర్ణించే హృదయం ఉండటమే అందం అదే ఆనందం...
చిన్ని కవితలకు మనసు పొంగితే అది పులకరింత ,,,,అది తెలియజేసే భాష భ్హవానికి అందని మధురమైన అనుభూతి ...
భాష తెలియని భావాలకు నిదర్శనం ఈ చిన్న దృశ్యం ...
సమ్మోహన రూపం ఉండటమే అమ్మాయిల అర్హత కాదు......
ఆ అందాన్ని మరింత మనోహరంగా వర్ణించే హృదయం ఉండటమే అందం అదే ఆనందం...
చిన్ని కవితలకు మనసు పొంగితే అది పులకరింత ,,,,అది తెలియజేసే భాష భ్హవానికి అందని మధురమైన అనుభూతి ...
Thursday, August 19, 2010
Saturday, June 26, 2010
కవిత ....
వాళ్ళు నన్ను
కవితలురాయమంటారు
వాళ్ళే వర్ణాలు అద్ది
నా అక్షరాలను
దుకాణాలలో అమ్ముకుంటారు
శీర్షిక కావచ్చు
విషయం కావచ్చు
అంతా వాళ్ళ ఇష్టమే
బల్ల మీద కాగితాలు
ఎప్పుడు చెల్లాచెదురుగా
గాలికి రేపరేపలాడుతుమ్తాయి
నా ఆకలికి అవసరమైన
ఆహారం
నేనుమ్డాల్సిన గది
కూర్చోవాల్సిన కుర్చీ
అన్ని
వాళ్ళే నిర్ణిస్తారు
రాజీ పడలేని మనసు
వాళ్ళ మాటలకు కుదుర్చుకున్న
ఒప్పందం
బాధ కలిగిస్తున్నాయి
పుట్టే ప్రతి ఆలోచన
రాసే ఒక్కో వరుసా
చివరికి
వాళ్ళ కోసం రాసేవే
అక్కడా ఇక్కడా
మార్పులు చెప్పి
నా కవితలో
వాళ్ళ ముకాలను
చూస్తున్నాను
ఒక్కోసారి
వాళ్ళ అభిప్రాయాలకు
నేను జోడించే మాటలు
వసీకరమంత్రంగా
ఎట్లా పరవ్సిన్చిపోతున్నాయో
తెలియడంలేదు
నా ఆసలు భారమై
పెను నొప్పులతో
లోటుపాట్లు ఉన్న
ఒక ప్రపంచాలాగా
మారిపోతునాయి
అయిన
వాళ్ళు మాత్రం
నా సృష్టిని
ఆహా ఒహో
సేహభ్ష్ అంటూ
సంబరాలు చేసుకుంటున్నారు
రాయడం పూర్తియిన తర్వాత
కాగితాల్లో
కవితలురాయమంటారు
వాళ్ళే వర్ణాలు అద్ది
నా అక్షరాలను
దుకాణాలలో అమ్ముకుంటారు
శీర్షిక కావచ్చు
విషయం కావచ్చు
అంతా వాళ్ళ ఇష్టమే
బల్ల మీద కాగితాలు
ఎప్పుడు చెల్లాచెదురుగా
గాలికి రేపరేపలాడుతుమ్తాయి
నా ఆకలికి అవసరమైన
ఆహారం
నేనుమ్డాల్సిన గది
కూర్చోవాల్సిన కుర్చీ
అన్ని
వాళ్ళే నిర్ణిస్తారు
రాజీ పడలేని మనసు
వాళ్ళ మాటలకు కుదుర్చుకున్న
ఒప్పందం
బాధ కలిగిస్తున్నాయి
పుట్టే ప్రతి ఆలోచన
రాసే ఒక్కో వరుసా
చివరికి
వాళ్ళ కోసం రాసేవే
అక్కడా ఇక్కడా
మార్పులు చెప్పి
నా కవితలో
వాళ్ళ ముకాలను
చూస్తున్నాను
ఒక్కోసారి
వాళ్ళ అభిప్రాయాలకు
నేను జోడించే మాటలు
వసీకరమంత్రంగా
ఎట్లా పరవ్సిన్చిపోతున్నాయో
తెలియడంలేదు
నా ఆసలు భారమై
పెను నొప్పులతో
లోటుపాట్లు ఉన్న
ఒక ప్రపంచాలాగా
మారిపోతునాయి
అయిన
వాళ్ళు మాత్రం
నా సృష్టిని
ఆహా ఒహో
సేహభ్ష్ అంటూ
సంబరాలు చేసుకుంటున్నారు
రాయడం పూర్తియిన తర్వాత
కాగితాల్లో
వెతుకుతున్నవే కవితను , నన్నూ
కానీ నేను వాటిలో కనిపించడంలేదు
కొచం ఆగండి
వాళ్ళు వస్తున్నారు
నేను
- మల్లి కవిత రాయాలి ,,,, .....మీ Venkat
Saturday, June 12, 2010
Snehamaaaaaaa....
నీకూ స్నేహితులున్నారా అని హృదయం అంటే
కన్ను కన్నీరు కారిస్తే
చేతి వేళ్ళు స్నేహితులై ఓదారిస్తె
అది పాపమా లేక అదృష్టమా?
ఐతే అది ఎవరిది ?
స్నేహాన్ని జ్ఞప్తికి తెచ్చిన హృదయానిదా (లేక)
స్నేహానికి విలువ నిచ్చిన నయనానిదా (లేక)
స్నేహితులై నయనాన్ని ఓదార్చిన చేతి వెళ్ళవా (లేక)
అద్భుతమైన ఈ జన్మనిచ్చిన మన తల్లితండ్రిలదా ?
......ఇలా ఇలా ఎన్నో ఎన్నెన్నో సరిగమల పదనిసలు ....
అందుకే ఈ జన్మలో తీపి స్మృతులను అందించిన గత వేసవి లాగే ఈ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొంగొత్త సరికొత్త ని అందరూ
ఆస్వాదించాలని , సెలయేళ్ళతో
చిలిపి ఊసుల సవ్వడులతో
వెన్నెల దారుల్లో ఊహల గాలుల్లో
ఆస్వాదిస్తూ చేసుకున్నా లేకున్నా
ఎప్పుడూ ఇలాగె ఎప్పటికీ నవ్వుతూ నవ్విస్తూ ఈ వసంతాన్ని ఆస్వాదిస్తూ ఎందరో మిత్రులను , ఆత్మీయులను సంపాదించాలని
నా మనసు ఆకాంక్షిస్తూ
ఏదో తన్మయత్వంలో
తెలిసీ తెలియని కవిత్వంతో
అక్షరాల ఆదుర్దాతో
మీకై ఇలా
" సరిక్రోత్చ పలుకుతూ "
సదా మీ నేస్తం ......... మీ ....;;;;;;;;
Saturday, May 15, 2010
Its a feeling of a Loved one when they miss their love....
అటు నువ్వే ఇటు నువ్వే ,
మనసు ఎటు చూస్తే అటు నువ్వే ,
ఎటు వెళ్తున్నా ఎమ్చేస్తున్నా ప్రతిచోట నువ్వే .
అటు నువ్వే ఇటు నువ్వే ,
అలికిడి వింటే అది నువ్వే ,
అడమర్పైన పెదవులపైన ప్రతిమాట నువ్వే .
అపుడు ఇపుడు ఎపుడైనా ,
నా చిరునవ్వే నీవలనా ,
తెలియని లోకం తీపిని నాకు రుచి చుపావులే .
ప్రచియం అంతా గతమేనా ,
గుర్తుకురాన క్షణమైనా
ఎదురుగ ఉన్నా నిజమేకాని కలవైనవులే
రంగు రూపం అంటూ లేనేలేనిది ఈ ప్రేమ ,
చుట్టూ శూన్యం ఉన్నా నిన్ను చుపిస్తుఉంది .
దూరం దగ్గర అంటూ తేడా చూడదు ఈ ప్రేమ ,
నేల చెంత చేరి నన్ను మాటడిస్తుంది ,
కనుపాపలోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్పపాటు కాలమైన మరపే రావుగా .
ఎద మారుమూలలొ ఒదిగున్నాప్రాణమై ,
నువ్వే లేను నేను లేనే లేను అనిపించవుగా
నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వు అయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనట్టు నను ఒంటరిచేసావే
ఏకాంత వేళలో ఈ కాంతి లేదురా
నలుసంతకూడా జాలి లేని పంతాలు ఏంటిలా
నీ తోడులేనిదే మన్సున్దలేదుర
నీ పేరు లేని ప్రేమనైన ఉహించేదెల .
అటు నువ్వే ఇటు నువ్వే మనసు ఎటు చూస్తే అటు నువ్వే
ఎటువెళ్తున్నా ఏమ్చేస్తున్నా ప్రతిచోటా నువ్వే .
Tuesday, April 6, 2010
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి "2"
మమతలన్ని మౌనగానం
వాన్చలన్ని వాయులీనం "వేణువై "
మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ
ఏడుకొండలకైన బండతానోక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే "2"
నీ కంటిలో నలతలో వెలుగునే కనక
నేను నేననుకుంటే ఎదచీకటే "హరి "
రాయినై వున్నాను ఈ నాటికి
రామపాదము రాక ఏ నాటికి "వేణువై "
నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగా మారే నా గుండెలో "2"
ఆ నింగిలో కలిసి ఆ శూన్యభందాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు "హరి "
రెప్పనై వున్నాను నీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి "వేణువై "
ఏడుకొండలకైన బండ తానోక్కటే
ఏడు జన్మల తీపి ఈ భంధమే "2"
ఈ చరణానికి అర్ధం తెలుపగలరు .
గాలినై పోతాను గగనానికి "2"
మమతలన్ని మౌనగానం
వాన్చలన్ని వాయులీనం "వేణువై "
మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ
ఏడుకొండలకైన బండతానోక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే "2"
నీ కంటిలో నలతలో వెలుగునే కనక
నేను నేననుకుంటే ఎదచీకటే "హరి "
రాయినై వున్నాను ఈ నాటికి
రామపాదము రాక ఏ నాటికి "వేణువై "
నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగా మారే నా గుండెలో "2"
ఆ నింగిలో కలిసి ఆ శూన్యభందాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు "హరి "
రెప్పనై వున్నాను నీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి "వేణువై "
ఏడుకొండలకైన బండ తానోక్కటే
ఏడు జన్మల తీపి ఈ భంధమే "2"
ఈ చరణానికి అర్ధం తెలుపగలరు .
Monday, April 5, 2010
ఈ పదాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కాదు ఎందుకంటే ఇది నిత్యం మన చుట్టూ జరిగే సంఘటనలకు ప్రతిరూపమని నా ఉద్దేశం ....ప్రతిచోట మనము ఎవరినయితే గౌరవించాలో వాళ్ళనే కించపరిచేలా ప్రవర్తిస్తున్నాం ఇది ప్రతి ఒక్కరు చేసేదని అందరికి తెలుసు కాని ఎవరు పట్టించుకోరు "ఎవరో
వస్తారు ఏదో చేస్తారు" అని ఎదురు చూడటంలో సమయం గడిచిపోతుందే కానీ జరిగేది ఏమి లేదు...
ఇది ఒకసారి ఆలోచించాలని అనుసరించాలని నా విన్నపం ఎందుకంటే నవ్యసమాజంలో ప్రతి స్త్రీ కి జరిగే అన్యాయాలు మనం రోజు చూస్తాం కానీ పట్టించుకోము
ఎందుకంటే జరిగేది ఎక్కడో ఎవరికో అని చిన్న నిర్లక్ష్యం ఇదే అన్నింటికీ ముఖ్యమైన కారణం....
"పురిటిలోనే ఆడపిల్లల్ని చంపే విష సంస్కృతి కి మనం అలవాటు పడిపోతున్నాం ,ఒకవేళ ఆ అమ్మాయి పుట్టినా చుట్టూ ఉన్న ఎంతోమంది విషపురుగుల వలన
వాళ్ళు స్వతంత్రంగా ఉండటానికి ఎన్నో అవధులు పెడతారు అడుగడుగునా వాళ్ళు పడే కష్టాలు చూసి ఏమి చేయగలమో అది మనమే చేయాలి "
ముసలి తల్లితండ్రుల్ని వృద్ధాశ్రమం లో చేర్పించే అమానుష చేష్టలు మానివేయమని కోరుకుంటున్నాను ....
పుట్టిన నిమిషం నుంచి ప్రతి నిమిషాన్ని యమగండంగా గడిపే ప్రతి స్త్రీ మూర్తికి న్యాయం జరిగేలా చూద్దాం..మన చుట్టూ జరిగే అన్యాయాల్ని చూస్తూ ఉండకుండా
మనకు ఎలా వీలుంటే అలా సహాయపడటానికి ప్రయత్నిద్దాం ప్రతి స్త్రీ లో మన అమ్మను ,చెల్లిని,స్నేహితురాలిని ,ఆప్తుల్ని చూడటమే మన కర్తవ్యం అని నా
అభిప్రాయం ఇందులో ఏమైనా తప్పుంటే క్షమించండి అదేమీ లేదంటే నన్ను ఆదరిస్తారని ఆసిస్తూ ...మీ వెంకట్
Thursday, April 1, 2010
Anandam
కనులు తెరిచిన కనులు మూసిన ..........కలలు ఆగవేల
నిజము తెలిసిన కలని చెప్పిన మసను నమ్మదెల.......
ఎదుటే ఎపుడు తిరిగే వేలుగా......ఇదిగో ఇపుడే చూసా సరిగా...........
ఇన్నాలు నేన్నున్నది నడిరేయి నిదురలోన.....
అయితే నాకినాడే తొలిపొద్దు జాడ తెలిసిందే కొత్తగా............
పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పుసింది.....
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తుంది....
ఎందుకనో మది నీ కోసం ఆరాటం పెడుతుంది....
అయితేనే ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది...
దూరం మహా చెడ్డదని లోకం అనుకుంటుంది........
కాని ఆ దూరం నిన్ను దగ్గర చేసింది..........
నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది.............నీతో అది చెప్పిందా.... నీ ఘపకలే నా ఊపిరైనవని
నిజము తెలిసిన కలని చెప్పిన మసను నమ్మదెల.......
ఎదుటే ఎపుడు తిరిగే వేలుగా......ఇదిగో ఇపుడే చూసా సరిగా...........
ఇన్నాలు నేన్నున్నది నడిరేయి నిదురలోన.....
అయితే నాకినాడే తొలిపొద్దు జాడ తెలిసిందే కొత్తగా............
పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పుసింది.....
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తుంది....
ఎందుకనో మది నీ కోసం ఆరాటం పెడుతుంది....
అయితేనే ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది...
దూరం మహా చెడ్డదని లోకం అనుకుంటుంది........
కాని ఆ దూరం నిన్ను దగ్గర చేసింది..........
నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది.............నీతో అది చెప్పిందా.... నీ ఘపకలే నా ఊపిరైనవని
Thursday, March 11, 2010
Love heart...Don't hate Me..
మనసు నిప్పులా మారిపోతే ఈ మంటదేమి తప్పు ...
చేతులారా అంటిన్చుకున్నది గుండె ప్రేమ నిప్పు ....
మనసు నిప్పులా మారిపోతే ఈ మంటదేమి తప్పు ....
చేతులారా అంటిన్చుకున్నది గుండె ప్రేమ నిప్పు ...
..మనసా ఓ పిచ్చి మనసా.....
తెలుసా నీ తప్పు నీకు తెలుసా
నీ తప్పు నీకు తెలుసా...
కలలనే కంటిని కల్లలనీ నా కనులు ఘోల్లుమన్నా
వలపులో ఉంటిని మైకమనీ నా గుండె మొత్తుకున్నా ...
పరువపు పెదవుల మెరుపులలోనా ఉనికి మరచిపోయా
అరె గంపెడు ఆశల గుండెలను నమ్మించి మోసగించా ...
మనసా...
ఓ పిచ్చి మనసా ...తెలుసా నీ తప్పు నీకు తెలుసా ...
చెమటనే పచ్చనినోట్లవలె నా తండ్రి నాకు ఇస్తే
కొలిచిన కోమలి ప్రేమాలకై జలసాగా ఖర్చ్చు చేశా..
చేతికందిన కొడుకునని మా అమ్మ నమ్ముకుంటే
ఒక బొమ్మకు మనసుని ఇచ్చుకుని మనిషిగా చచ్చిపోయా ...
మనసా ...ఓ పిచ్చి మనసా
నీ తప్పు నీకు తెలుసా...
చేతులారా అంటిన్చుకున్నది గుండె ప్రేమ నిప్పు ....
మనసు నిప్పులా మారిపోతే ఈ మంటదేమి తప్పు ....
చేతులారా అంటిన్చుకున్నది గుండె ప్రేమ నిప్పు ...
..మనసా ఓ పిచ్చి మనసా.....
తెలుసా నీ తప్పు నీకు తెలుసా
నీ తప్పు నీకు తెలుసా...
కలలనే కంటిని కల్లలనీ నా కనులు ఘోల్లుమన్నా
వలపులో ఉంటిని మైకమనీ నా గుండె మొత్తుకున్నా ...
పరువపు పెదవుల మెరుపులలోనా ఉనికి మరచిపోయా
అరె గంపెడు ఆశల గుండెలను నమ్మించి మోసగించా ...
మనసా...
ఓ పిచ్చి మనసా ...తెలుసా నీ తప్పు నీకు తెలుసా ...
చెమటనే పచ్చనినోట్లవలె నా తండ్రి నాకు ఇస్తే
కొలిచిన కోమలి ప్రేమాలకై జలసాగా ఖర్చ్చు చేశా..
చేతికందిన కొడుకునని మా అమ్మ నమ్ముకుంటే
ఒక బొమ్మకు మనసుని ఇచ్చుకుని మనిషిగా చచ్చిపోయా ...
మనసా ...ఓ పిచ్చి మనసా
నీ తప్పు నీకు తెలుసా...
Sunday, February 28, 2010
MAnaSu
మనసు - స్నేహం
నా కళ్ళు ఎప్పుడు
బరువుగా వుంటాయి
నీవి నన్ను
చుదకున్నప్పుడు
కన్నీళ్ళతో !
నా గొంతు
బొంగురుగా వుంటుంది
నీవి నాతో
మాటలడకున్నప్పుడు
బాధతో !
నా మనసు
ఆందోలనగా వుంటుంది
నీవు నా మనసులో
ఉన్నవని
తెలుపకున్నప్పుడు
వినయంతో !
నా జీవితం
వ్యర్దం అనిపిస్తుంది
నీవు నాతో కలసి
నడవకున్నప్పుడు
దురదృష్టంతో !
కలిసి స్నేహంగా ఉండాలని కోరుకునే
........మీ వెంకట్
నా కళ్ళు ఎప్పుడు
బరువుగా వుంటాయి
నీవి నన్ను
చుదకున్నప్పుడు
కన్నీళ్ళతో !
నా గొంతు
బొంగురుగా వుంటుంది
నీవి నాతో
మాటలడకున్నప్పుడు
బాధతో !
నా మనసు
ఆందోలనగా వుంటుంది
నీవు నా మనసులో
ఉన్నవని
తెలుపకున్నప్పుడు
వినయంతో !
నా జీవితం
వ్యర్దం అనిపిస్తుంది
నీవు నాతో కలసి
నడవకున్నప్పుడు
దురదృష్టంతో !
కలిసి స్నేహంగా ఉండాలని కోరుకునే
........మీ వెంకట్
Snehamaa...
సన్నిహిత నేస్తమా ....బంధుత్వం మించిన స్నేహమా ...!!
మౌనం వహించేది మాటలు చెప్పలేక కాదులే ..!!
పలుకుల ప్రయాణం .సాగే ఆత్మీయతాబాట వెతుకుతూ ...!!
స్నేహమనే పూల బాట పడుతున్న ఈ చిరు సమయంలో ...!
మౌనం అనే చిన్న ఎడబాటు ..దూరాలు తెలుపదులే ..!!
మరిచిపోని అనుభందంలో సాగే జీవన స్మృతులు కలుపుతూ ..!!
మౌనం వహించేది మాటలు చెప్పలేక కాదులే ..!!
పలుకుల ప్రయాణం .సాగే ఆత్మీయతాబాట వెతుకుతూ ...!!
స్నేహమనే పూల బాట పడుతున్న ఈ చిరు సమయంలో ...!
మౌనం అనే చిన్న ఎడబాటు ..దూరాలు తెలుపదులే ..!!
మరిచిపోని అనుభందంలో సాగే జీవన స్మృతులు కలుపుతూ ..!!
Thursday, February 18, 2010
prema
ప్రేమ - అందమైన ప్రపంచం ... ప్రేమ లేనిదే జీవితం లేదు ఇది నా నమ్మకం . ప్రేమ అంటే అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అత్తా మామ ఇలా ఎన్నో బంధాలు . ప్రేమ లోకంలో ఎన్ని కస్టాలు ఉన్న ప్రేమించే వాలున్నంత కాలం జీవితం ఎప్పుడు కొత్త బంగారు లోకమే . ఇదంతా ఒక కల . నిజం ఏంటంటే మనుషుల మద్య బంధాలు తగ్గిపోతున్నై . కల్సుకోడానికి , ఎప్పుడైనా ఒక్కసారి మాట్లాడడానికి , దేనికి తీరిక లేకుండా పోయింది . రోజు ఒంటరి పోరాటమే . అందరు కలిసి ఉంటె ఇదంతా సంతోషమే కదా ..
Tuesday, February 16, 2010
Sunday, February 14, 2010
Subscribe to:
Posts (Atom)







.jpg)
.jpg)



