ఈ పదాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కాదు ఎందుకంటే ఇది నిత్యం మన చుట్టూ జరిగే సంఘటనలకు ప్రతిరూపమని నా ఉద్దేశం ....ప్రతిచోట మనము ఎవరినయితే గౌరవించాలో వాళ్ళనే కించపరిచేలా ప్రవర్తిస్తున్నాం ఇది ప్రతి ఒక్కరు చేసేదని అందరికి తెలుసు కాని ఎవరు పట్టించుకోరు "ఎవరో
వస్తారు ఏదో చేస్తారు" అని ఎదురు చూడటంలో సమయం గడిచిపోతుందే కానీ జరిగేది ఏమి లేదు...
ఇది ఒకసారి ఆలోచించాలని అనుసరించాలని నా విన్నపం ఎందుకంటే నవ్యసమాజంలో ప్రతి స్త్రీ కి జరిగే అన్యాయాలు మనం రోజు చూస్తాం కానీ పట్టించుకోము
ఎందుకంటే జరిగేది ఎక్కడో ఎవరికో అని చిన్న నిర్లక్ష్యం ఇదే అన్నింటికీ ముఖ్యమైన కారణం....
"పురిటిలోనే ఆడపిల్లల్ని చంపే విష సంస్కృతి కి మనం అలవాటు పడిపోతున్నాం ,ఒకవేళ ఆ అమ్మాయి పుట్టినా చుట్టూ ఉన్న ఎంతోమంది విషపురుగుల వలన
వాళ్ళు స్వతంత్రంగా ఉండటానికి ఎన్నో అవధులు పెడతారు అడుగడుగునా వాళ్ళు పడే కష్టాలు చూసి ఏమి చేయగలమో అది మనమే చేయాలి "
ముసలి తల్లితండ్రుల్ని వృద్ధాశ్రమం లో చేర్పించే అమానుష చేష్టలు మానివేయమని కోరుకుంటున్నాను ....
పుట్టిన నిమిషం నుంచి ప్రతి నిమిషాన్ని యమగండంగా గడిపే ప్రతి స్త్రీ మూర్తికి న్యాయం జరిగేలా చూద్దాం..మన చుట్టూ జరిగే అన్యాయాల్ని చూస్తూ ఉండకుండా
మనకు ఎలా వీలుంటే అలా సహాయపడటానికి ప్రయత్నిద్దాం ప్రతి స్త్రీ లో మన అమ్మను ,చెల్లిని,స్నేహితురాలిని ,ఆప్తుల్ని చూడటమే మన కర్తవ్యం అని నా
అభిప్రాయం ఇందులో ఏమైనా తప్పుంటే క్షమించండి అదేమీ లేదంటే నన్ను ఆదరిస్తారని ఆసిస్తూ ...మీ వెంకట్
No comments:
Post a Comment