వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి "2"
మమతలన్ని మౌనగానం
వాన్చలన్ని వాయులీనం "వేణువై "
మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ
ఏడుకొండలకైన బండతానోక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే "2"
నీ కంటిలో నలతలో వెలుగునే కనక
నేను నేననుకుంటే ఎదచీకటే "హరి "
రాయినై వున్నాను ఈ నాటికి
రామపాదము రాక ఏ నాటికి "వేణువై "
నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగా మారే నా గుండెలో "2"
ఆ నింగిలో కలిసి ఆ శూన్యభందాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు "హరి "
రెప్పనై వున్నాను నీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి "వేణువై "
ఏడుకొండలకైన బండ తానోక్కటే
ఏడు జన్మల తీపి ఈ భంధమే "2"
ఈ చరణానికి అర్ధం తెలుపగలరు .

No comments:
Post a Comment