venkat

venkat
needs You

Thursday, October 20, 2011

Aadolla prema o neeti moota...



అమ్మా...అమ్మా  కన్నె పువ్వమ్మా, నన్ను నువ్వే విడిచి పోయావేలమ్మా,, గుండెల్లోని గాయం చూడమ్మా నా మానం ప్రాణం నీవేనోయమ్మా 
అరె ఆడోల్ల ప్రేమ ఓ నీటి మూట మగవాడి ప్రేమ ఓ రాతి గోడ..
కలలోనైనా నిన్నే తలిచేనే ఆ కలలే రాక మూగైపోయానే, పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే నా శ్వాసను  నువ్వే పట్టుకుపోయావే 
మగువను నమ్మి చెడిపోయినోళ్ళు లక్ష , ఆ వరుసన నిలిపి నాకు వేసినావు శిక్ష,
పాము కాటువేస్తే మన ఊపిరాగుతుందే, కన్నె ప్రేమ కుట్టేనంటే ప్రతి రోజు చంపుతుందే 
అరె చెయ్యి విడిచి నువ్వు పోయాక గుండె మూగదైపోయింది, నిన్ను నమ్మి నీ వెనకొస్తే  మనసంతా ఓ పుండైనాది ..
వలపంటే ఓ ముళ్ళ బాటరా అటు నడిచావంటే ఆశే తీరదయా ,,,,వలపంటే ఓ మత్తుమందురా  అది వేసావంటే ప్రాణం దక్కదురా ..

చిల్లులున్న  మురళి అరె పాత పాడగలదు , గుండె గాయం ఎంతదైన బాస మరచిపోదు ..
ప్రేమ ఉన్నవారు మది వీడివెళ్ళలేరు , నమ్మి మోసపోతి నేడు ఇదీ చెప్పలేని గోడు 
నను నీట ముంచి నువ్వు వెళ్ళోద్దే  , ఎదుట నిలిచి నను చంపోద్దే 
కంటి చూపులే కరువైతే మరు క్షణమే  నే మనలేనే ..
వన్నెలు చిలికే రామ చిలకమ్మా ...ఎద గూటిని దాటి పోయావేలమ్మా 
ప్రేమే లేని గూడే యాడున్నా నా కళ్ళే మూసి తీసుకుపోవమ్మా..

అమ్మా...నా కన్నె పువ్వమ్మా, నన్ను నువ్వే విడిచి పోయావేలమ్మా,, గుండెల్లోని గాయం చూడమ్మా నా మానం ప్రాణం నీవేనోయమ్మా 
అరె ఆడోల్ల ప్రేమ ఓ నీటి మూట మగవాడి ప్రేమ ఓ రాతి గోడ..
కలలోనైనా నిన్నే తలిచేనే ఆ కలలే రాక మూగైపోయానే, పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే నా శ్వాసను  నువ్వే పట్టుకుపోయావే 

Saturday, September 24, 2011


గుండె గొంతులో ఆగిపోయింది మాటలే తోచక, కంట కన్నీరు చెంప తడిమింది బాధనోదార్చగా ..
మనసుకేనాడో మనసుతో మనువు జరిగిపోయిందిగా..కాలం ఈనాడు కాదు పొమ్మంటే ఊరుకోలేదుగా..
మనం అన్న ఒకమాట నువ్వు-నేనుగా వేరు కాలేదుగా..
గుండె గొంతులో ఆగిపోయింది మాటలే తోచక, కంట కన్నీరు చెంప తడిమింది బాధనోదార్చగా..
ఆట నిజం..మాట నిజం..ఆడుకుంది ఆ దైవం ..ఆడకనే తగిలిందా ఈ గాయం ..
బాధ  నిజం..బరువు నిజం...దాచలేదుగా హృదయం..తేలికగా తెగదు కదా అనుబంధం..
త్యాగమే సాయమై ఊరడించినా ...ప్రేమకే దూరమై ప్రాణమాగునా..ఊహకే రాని మలుపులు గెలిచే గెలుపు  కనిపించునా ..
కంటతడే లేదు అనే కానరాని బరువేనా..ఒంటరిగా దిగులునువే మోయాలా..
ఎడబాటే అలవాటై ఎటోవైపు నడవాలా ...ఎదమంటే దీపంలా మిగలాల ...
రాయిలా మారిన రామచంద్రుడా ..సీతలో చింతనే చూడవేమిరా ..
కనులు తెరిచి నువ్వు చూడకపోతే కలత తీరేదెలా..

Thursday, September 22, 2011



నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో, నీవేనాడో మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ  గీతిని..
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో, నీవేనాడో మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ  గీతిని..
ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ..
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది ..చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది 
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా?
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధనా నీకు ఈనాడు తెలిపేది నా వేదన..
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా?
నేనిన్నాళ్ళు చేసింది ఆరాధనా నీకు ఈనాడు తెలిపేది నా వేదన..
ఇదే నిన్ను వినమని నన్ను ఇదే నిజం అనమని ..
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ...చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది.

Tuesday, September 6, 2011

Ammayi...

అందమైన నా ఊహలమేడకు ఆవిడ మణిదీపం ..
అందీ అందని ఆ ఆశలకు ఆమే ప్రతిరూపం...
ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం...
మల్లెపూల  కన్నా  మంచు పొరల కన్నా నా చెలి ముసి ముసి నవ్వులు అందం..
నెమలి హోయల కన్నా సెలయేటి లయల కన్నా నా చెలి జిలిబిలి నడకలు అందం..
అపురూపం ఆ నవలావణ్యం ..అపురూపం ఆ నవలావణ్యం అది నా మదిలో చెరగని స్వప్నం ..

Saturday, July 2, 2011

వేయి జన్మాల చెలిమి నీవే



వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ..
కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికీ..
నిను దాచే ఈ నిశీ ...నిలిచేనా ప్రేయసీ...
నలువైపులా నల్లని చీకట్లే ఎదురోస్తూ ఉన్నా 
పరుగాగని పాదం  దూరంతో పోరాడుతూ ఉన్నా 
కనుపాపకి ముప్పని కన్నీరే తెరవేస్తూ ఉన్నా ..
ప్రతినిమిషం నీవైపే పయనిస్తూ ఉన్నా...
గాలితో నువు పంపిన వలపు ఊసేమిటో...
పూలలో నువు నింపిన తీపి తలపేమిటో...
నిన్ను నా కలను చేరలేదని నమ్మడా చెలి నీ మౌనం..
నా శ్వాసతో రగిలి గాలులతో నిను వెతికిస్తున్నా ..
నా ప్రేమకి పూల సువాసనతో నీకందిస్తున్నా...
ఎదసవ్వడులే ఆ గువ్వలుగా ఎగరేస్తూఉన్నా..
వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ...
ఆశగా ఉంది నిచ్చెలీ ...కలుసుకోవాలనీ...ఈ
కోవెలై ఉంది కౌగిలీ ...దేవి రావాలనీ...ఈ
నీవు కలవని కలవు కావనీ రుజువుచేయనీ అనురాగం ...
నను నేనే శిలగా మోస్తూ ఉన్నా ఎద  బరువైపోగా ...
చిరునవ్వులనే వెలివేస్తూ ఉన్నా నిను చూసేదాకా...
ప్రతి రక్తకణం వెలిగిస్తూ ఉన్నా పెనుజ్వాలై పోగా..
ఎడబాటు పొరబాటు కలిగించేదాకా..
వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకీ...
కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికీ...

Friday, June 3, 2011

మనసంతా ముక్కలు చేసి

మనసంతా ముక్కలు చేసి పక్కకు వెల్తావెందుకు  ఓ  నేస్తం...
ఊరించి ఊహలు  పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం...
నీకై నీకై ప్రానాలిస్తానన్నా ఇంకా ఇంకా అలుసైపోతున్నానా..
పొరపాటుంటే మన్నించవే....

విరిసిన పువ్వుల కొమ్మ తను పెనవేసిన ఒక రెమ్మ ఎవరో తె౦చేస్తూ  ఉంటే ఒప్పుకుంటదా..
బుడి బుడి అడుగుల పాపైనా తను ఆడుకునేదొక బొమ్మైనా ఎవరో లాగేసుకుంటే ఊరుకుంటదా..
నువ్వు నచ్చి మనసిచ్చి ఇపుడిక్కడే ఇదీ చూస్తుంటే కనుపాపల్లో కునుకు౦డదే...

వెలుతురు ఉన్నపుడేగా నీ వెనకన ఉంటది నీడ ఉంటా నడిరాతిరైన నీకు తోడుగా...
చిగురులు ఉన్నపుడేగా ఆ కుహు కుహు కోయిల పాత అవుతా నీ గుండెలయగా అన్నివేళలా ...
నిను కోరా ఇటు చేరా నువ్వు ఎటువైపో అడుగేస్తే యదలోతుల్లో కుదురు౦డదే ......

మనసంతా ముక్కలు చేసి పక్కకు వెల్తావెందుకు  ఓ  నేస్తం...
ఊరించి ఊహలు  పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం...
నీకై నీకై ప్రానాలిస్తానన్నా  ఇంకా ఇంకా అలుసైపోతున్నానా..
పొరపాటుంటే  మన్నించవే....

Monday, May 2, 2011

చందమామలాంటి రూపం ... సిరిమల్లె లాంటి నవ్వు


 

చందమామలాంటి రూపం ... సిరిమల్లె లాంటి నవ్వు...
తేనెలూరు నీ పలుకులు ...
కలకాలం నీ స్నేహం...
    నాలో కురిపించెను  జడివాన ,,,,,
 నీ ఆలోచనలే నాలో పొంగే అలలు ....
 మంచులో ముత్యమా....   కదిలే వెన్నెల శిల్పమా...కవులకే అందని అందమైన భావమా....
ఈ మాటే గుండెల్లో రాస్తానే ఈవేళ ,,,,
కష్టాన్నే నవ్వుతో దాస్తానే ఏదోలా
లోకాలన్నీ  చిన్నంగా నన్నే చూస్తున్నా 
ఆకాసంలో నిన్నింకా ఊరేగిస్తాగా .....
నీ రూపం నా హృదయంలో పదిలం అది నిలిచెను కలకాలం ....
గడచిన గతమే చెదిరే క్షణము వరకు నిదరోదమ్మా...

Tuesday, April 12, 2011

నిన్ను ఆరాధించడమే పాపమా?


ఎన్నో కలలు ఎన్నో ఆశలు ..నువ్వే నేనని నేనే నువ్వని నా ఆశకు శ్వాసవు నీవని
 నా కంటిపాపవు నువ్వే అని నా హృదయ స్పందన నీవని నువ్వు లేని నేను ఒక రాయినని విలువలేని శిలనని 
నీ నవ్వు నవవసంతమని  నీవు లేని నాడు నాకొక అమావాస్య అని ఉన్నంత కాలం నీతోనే ఉండాలని 
నీ నీడగా కలకాలం నీతోడుగా ఉండాలని
 ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా నువ్వే నా శక్తిగా అనుకొని
 కష్టాలను ఇష్టంగా కలతలను ప్రీతితో జయించి నువ్వు అనే నా లక్ష్యానికి చేరుకోవాలని 
నీ సంతోషమే నా ఆనందంగా కష్టాన్ని నీ చెంత చేరకుండా చూసే నేస్తంగా 
నీ ప్రతి కదలికలో తోడుగా ఉండాలని ..
జీవితమంటే ఇదేనా? ఎవరు నన్ను ఇష్టపడరా?
నేను ఎవరిని ఇష్టపడినా దూరమవ్వటం  మాత్రమేనా?
నాకంటూ సంతోషాలు లేవా? ఇంకెపుడు రావా?
నా జీవితం మొత్తం ఇంతేనా?
ఎప్పుడు నాకు బాధలేనా?
నేను ఎవరికీ ఏమి కాలేనా?
అందరికి నేనంటే అసహ్యం మాత్రమే ఉంటుందా ?
ఆనందంగా ఉండే అదృష్టం నాకు లేదా? నేను నిన్ను ఇష్టపడటమే నేరమా ? నిన్ను ఆరాధించడమే పాపమా? ...
నా దేవత నువ్వనుకోవడమే నా తప్పా.....?

Friday, April 8, 2011

Priya nestama...

















పుష్పించానన్న  విరికి  తుమ్మెదను అవుతానన్నావు  ..!!
నేలరాలనన్న  జల్లుకి  హరివిల్లౌతానన్నావు ..!!
నింగి  వీడని  చీకటికి  వెన్నేలౌతానన్నావు ...!!
నిద్దుర  ఎరుగని  కలకి  వాస్తమౌతానన్నావు ..!!
నీడగా  మరుజన్మకు  కూడా  తోడు అవుతానన్నావు ....!!

వీడలేనన్నావ్  మరిచితివా ??
... ప్రియ  నేస్తమా ...!!


పుష్పించకుండానే  పువ్వు  నేల రాలుతానంటుంది ...!!
నేలరాలానన్న  జల్లు  బీడుగా  మారుతానంటుంది...!!
మారి  పోనీ  చీకటి  వేకువ  ఇంకా  రాదంటుంది..!!
రాదనుకున్న  నిదుర  కలలాగే  మిగిలిపోతానంటుంది...!!
మిగిలిపోతున్న  బాసలతో  ఊపిరి  వదిలేస్తానంటుంది..!!

మరుజన్మలో  తీరుస్తావా ?
....వీడుకోలు  ప్రియతమా .!!

Tuesday, March 29, 2011

ప్రియసఖి

దేవతల్లే  వరములిస్తివే  నిను  చేరకుండా దూరమైతినే ,,,
ఎపుడు ఎదలో చేరెనో చెలి నేనదగకుండా మనసు ఇచ్చేలే...
చివరివరకు ,... మరువలేను ...ప్రియసఖివే కనబడవే ...
ఓర్వలేని ఓరి దేవుడా ....మా మౌనరాగం వినిపించదా...
గాయపడిన మనసు చూడరా ...మా గీత  కాస్త  మార్చి రాయవా..

నీజ్ఞాపకలేమో వెంటాడుతుంటే ఎన్నెన్నో అందాలు విరబూసెనే...
నీ నవ్వులే నను వీడి వెలుతువుంటే వికసించే అందాలు  ఏమాయెనే ...
ఎంత చిత్రమే చెలీ ఇదివరకిది తెలియదే ఏమి మంత్రమో మరి నను వీడనిదే...

నీతోడు ఉంటె ఏ లక్ష్యమైన సులువే ..నిని చేరకుంటే నా ప్రాణమైన బరువే ..
చెలియా తలపులో ఎన్నెన్ని ఊహలో చెలియా చెలిమిలో ఎన్నెన్ని ఆశలో...

నీలాల కనుపాప నిను వెతుకుతు ఉంటే హరివిల్లు నీ జాడ నను కోరెనే ...
నీ రూపు రేఖల్ని వివరించమంటూ  వెంటాడి నన్నేమో వేధించేనే...

నీవులేనిదే చెలీ నా బ్రతుకిక శూన్యమే...
నీవు నన్ను  చేరితే మరణము సుఖమే 
నా గుండె గుడిలోనే నీ దివ్వె కొలువు ...నా పంచప్రాణాలు నీలోన కలవు ..
ఎదలగడపలో  ఎదురుచూపులు ..కనుల కొలనులో కన్నీటి కలువలు...

దేవతల్లే వరములిస్తివే నిను చేరకుండా దూరమైతినే...

Saturday, March 12, 2011

బంగారు వల....



పచ్చా  పచ్చాని  కల  వేసే  బంగారు  వల  ప్రేమంటే …
పచ్చ  పచ్చాని  కల  వేసే  బంగారు  వల  ప్రేమంటే …

అడిఆసే  అయ్యేనే  ఊహల్లొ సాగేనే  ఏకాంతం  వెంటాడుతూ  వేటాడేనే…
ఒట్టులెన్నో వేశావే   గాలిలోన  కలిపావే , ఆశలన్నీ చూపించి  నా  కళ్ళు  రెండు  మూశావే,,,


ఒట్టులెన్నో  వేశావే   గాలిలోన  కలిపావే , ఆశలన్నీ  చూపించి  నా  కళ్ళు  రెండు  మూశావే 
కన్నా  కలలో  ఉదయాలే  దోచి  కనుమరుగై  తేలవారేనే 
ఒక్క  క్షణమే  లక్షపూలై  పూసి  ,నన్ను  విడిచి  కథ  మారెనే ,,,
విధిరాతకు  కర్తెవ్వరు  నేనే  నేనే …

పచ్చా  పచ్చాని  కల  వేసే  బంగారు  వల  ప్రేమంటే …
పచ్చా  పచ్చాని  కల  వేసే  బంగారు  వల  ప్రేమంటే …
కోరుకున్న  గాయమిది , ఊరడింపు  పొందనిదీ
రాలుతున్న  పూత  ఇదీ ,తోడులేని  మోడు   ఇదీ,
కోరుకున్న  గాయమిడీ  ఊరడింపు  పొందనిదీ 

రాలుతున్న  పూత  ఇదీ ,తోడులేని     మోడు  ఇదీ ,,,
గుండె రగిలే   వడగాలి సెగలు  కంటితడితో ఇక  ఆరేనా 
పోద్దుపోడుపే  కనలేదీ  ప్రాయం  కునుకేది  నడి  రేయయినా 
నా  దారిలో  నాకెవ్వరు  లేనే  లేరే ,,,,,

పచ్చా   పచ్చాని  కల  వేసే  బంగారు  వల  ప్రేమంటే …
పచ్చా  పచ్చాని  కల  వేసే  బంగారు  వల  ప్రేమంటే …
అడిఆశే  అయ్యేనే  ఉహల్లో  సాగేనే  ఏకాంతం  వెంటాడుతూ  
వేటాడేనే
  …



Saturday, February 12, 2011

Nannodili velloddu....

కలలను అలలు అన్నావు నువ్వు తీరం చేరగానే నన్ను మాత్రం సుడిగుండంలో తోసేసావు ...
రంగుల ప్రపంచం నీకిష్టం అన్నావు, అడిగినదే ఆలస్యమని రెక్కలు కట్టుకెళ్ళి ఇంద్రధనస్సులోని రంగులు తెచ్చి
 నీ ముంగిట నిలిపెలోగానే నన్ను రంగులు కలిపే సిరా మాత్రమే అన్నావు..
కారు చీకటి నా జీవితంలో రాకుండా చూసే వెలుగు నువ్వవుతావని ఆశ పడ్డాను ,
కానీ జీవితం అంతా అంధకారం చేసి వెల్తావనుకోలేదు.... 
నువ్వు నాదానివి కాదని తెలిసిన క్షణాన నా హృదయంలో ఉన్న బాధ ఒక్కసారిగా బద్దలయిన అగ్ని పర్వతంలా కన్నీటి లావాను వెదజల్లింది...
నిన్ను ఎలాగయినా చేరుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు నన్ను శూన్యం అన్నరోజునుంచి నిన్ను చేరుకునే దారిలేక ఏ ఆధారం లేని వాడినయ్యాను...
నామీద నీకు ప్రేమ అనే ఆధారం లేనంతకాలం నాకంతా శూన్యం...
ఇంత జరిగినా నీమీద నాకున్న ప్రేమ అనన్యం,అనితర సాధ్యం...
నా ఆశకు శ్వాసవు  నువ్వై ,భవితకు వేలుగుదివ్వేవై జీవితాంతం ఎవ్వరితోను అవమానం పొందకుండా నీ రంగుల ప్రపంచంలో ఆనన్న్డంగా ఉండాలని,
కలలోను,ఇలలోనూ నీ రాకకై ఎదురుచూసే....
                                                                                                                                   నీ..

Monday, January 24, 2011

feel when U get this.....

అనురాగం అన్నది అందమైనది మమకారం ఉన్నది మధురముగా ....
కన్నులు చూడని అందమేల మమతలేని మధురమేల .....
మనసున ఉన్నది చెప్పలేని బాధ కాని అది పంచుకోలేక నేను  పడుతున్నా వ్యధ ..
చిన్న ఆశలనే ఆశించాను కానీ అది తీరదని తెలిసిన నా మనసు భరించలేకున్నది
ఇది తీరెదేనాడో నేను కోరుకున్న కోరిక నెరవేరేది ఎప్పుడో అని నా కళ్ళు క్షణం ఒక యుగంలా ప్రతి నిమిషం ఒక మరణంగా అంతులేని దారివైపు ఆశగా చూస్తున్నాయి ....
తను వదిలి వెళ్ళిన నన్ను నేనే తనకు అంకితం ఇవ్వాలని అనుకున్న కానీ స్నేహం అనే సంజీవని నన్ను మనిషిని చేసి మమతను పంచుతోంది ఇది లభించిన నేను ధన్యజీవిని ....నా స్నేహం చిరంజీవి అని చెప్పడానికి సగర్వంగా భావిస్తున్నా...
ప్రతి స్నేహం ఒక మధురానుభూతిని మిగిల్చింది ....

Friday, December 3, 2010

ఇష్టపడ్డ అమ్మాయి .....

తన రూప౦ గొప్పది కాదంటా... తనలా ఎవ్వరు లేరంటా....
తన రంగూ గొప్పది కాదంటా  .. తన సాటేవ్వరు రారంటా ....
తన రూప౦ గొప్పది కాదంటా ....తనలా ఎవ్వరు లేరంటా..
తను పెద్దగా చదువెం చదవదంటా...తన కదలికలే చదువుతుంటా ..
తను చిన్న కుక్కపిల్లనేం పెంచుకోదంట నేను వెనక వెళ్ళితే అడ్డుకోదంట....
తను బొమ్మల్ని వాటేసి నిద్రపోదంట నే బొమ్మై పుడితే బాగుండునంటా...
తన జడలెం బారెడు కాదంటా...ఆ ముడిలో హృదయం పడదంట....
చేగాజులు బంగారుకాదంట తన చేతిని వదలక నేనుంటా ...
తను కాక నాకు ఎవరంటా....జంట ఎవరంటా ...
తన రూపం గొప్పది కాదంటా ...తనలా ఎవ్వరు లేరంటా
తన రంగూ గొప్పది కాదంటా ...తన సాటేవ్వరు రారంటా..
తను పట్టుచీరలెం చుట్టుకోదంటా...తను చుడిడారుతో నా చుట్టమైన్దంట్ట.....
తను తిట్టేస్తుంటే బాధలేదంటా...ఆ మాటే నాకు దీవేనలంటా...
తనకంతం ఏది కాదంటా తను లేక ఊపిరి లేదంటా తన పంతం ఏది కాదంటా తను కాక నాకు ఎవరంటా
తను కాక నాకు ఎవరంటా సొంతం ఎవరంటా...
తన రూపం గొప్పది కాదంటా తనలా ఎవ్వరు లేరంటా ...
తన రంగూ గొప్పది కాదంటా తన సాటేవ్వరు రారంటా...

Thursday, December 2, 2010

ఒక అమ్మాయికోసం



నా ప్రాణం నువ్వైపోతే  గుండెల్లో కోలాటం

నీతోటి బతకడానికే చేస్తున్నా పోరాటం

నా పాటకు మాటై వచ్చావే హో... ఓ....

ఎదచప్పుడు చేసే శృతి నీవే

ఎండల్లో వెన్నెల తెచ్చావే...

నిప్పుల్లో వానై వచ్చావే ......

నీ పరువాన పూల్జల్లై కురిపించావే

నా మనసుని దోచి మాయలు చేసి మురిపించావే ....

నా మదిలోని భావనలకర్థంనీవే ....

బుగ్గల్లో విరిసేటి సిగ్గైనావే ....

నా లోకం చీకటికోన నువ్వొస్తే వెన్నెలవాన.....

 ప్రతిరేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా ....

ఎండల్లో వెన్నెల తెచ్చావే హో ...ఓ

నిప్పుల్లో వానై వచ్చావే...

నీ తోడంటూ ఉండనినాడే జగమే శూన్యం...
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం...
నీ మురిపించే రాగాలితే మల్లెల దాహం ...
నా మదిలోన చిందులువేసే అల్లరి దాహం...
నీ జాడగా ఉంటేతప్ప నా నీడకు అర్థంలేదే ..
అంతకంటే వరమే ఏలా ప్రియా ....ప్రియా...
నా ప్రాణం నువ్వైపోతే  గుండెల్లో కోలాటం
నీతోటి బతకడానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై వచ్చావే హో... ఓ....
ఎదచప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే...     నిప్పుల్లో వానై వచ్చావే ...... ....

Tuesday, October 26, 2010

మనసు పడ్డాను కానీ.....

మనసు పడ్డాను కానీ మన్నించదేమోనని ,,,,,

కలలు కన్నాను కానీ కరునించదేమోనని,,,,

గుండెల్లో గుబులాయె ఏలనో .....

మాటేమో దాగే ఏ మూలనో .....


మనసు పడ్డాను కానీ మన్నించదేమోనని ,,,,,

కలలు కన్నాను కానీ కరునించదేమోనని.......

Saturday, October 2, 2010

భగ్న ప్రేమికుడు


కలువల్లాంటి నీ కళ్ళు చూసి నా భవితకు వేలుగునింపే జ్యోతివవుతావని,,,,,
చందమామ లాంటి నీ మోము చూసి నా జీవితానికి చెరగని గురుతువు అవుతావని ,,,,,
నువ్వు కోరితే రంగుల ప్రపంచాన్ని నీ ముందు నిలపాలని నిరంతరమూ అహర్నిశలు శ్రమించాను,,,,
        నువ్వు ఆశగా అడిగావని అంబరాన్ని తాకేలా అంతస్తులు నిర్మించాను,,,,,,
ఎక్కడ కందిపోతావో  అని పూలదారి నీకోసం పరిచాను....
నువ్వే ఆశగా, నీ ధ్యాసనే నా శ్వాసగా ప్రతినిముషం నీకోసమే  అనుక్షణం నీ ధ్యానమే చేస్తూ గడిపాను,,,,,
రంగులలోకంలో నన్ను నిలుపుతావని ఎంతో ఆశగా ఎదురుచుసాను కాని నువ్ నన్ను రంగులు అద్దే సిరాగా మాత్రమే చూస్తావని కలలో కూడా ఉహించలేదు ......
నువ్వు మనసు తెలుసుకుంటావని ఎన్నోసార్లు ఎదురుచుసాను కానీ నువ్వు ఇష్టపడేది నన్ను కాదు నా చుట్టూ ఉన్న ఐస్వర్యంకోసమని తెలిసిన క్షణం నుంచి ఘడియ ఘడియను నరకంలాగ అనుభవిస్తున్నాను ఇంకా ఎన్నాళ్ళు  నాకీ  హృదయ వేదన .....
ఎప్పటికయినా నువ్వు నా మనసు  తెలుసుకుని తిరిగోస్తావని క్షణమొక యుగంగా నిరీక్షిస్తున్నాను ,,,,,
                                      నీ రాకకోసమే ఎదురు చూస్తూ .......                   నీ భగ్న ప్రేమికుడు ,,,,,,,,,

Thursday, September 30, 2010

మన సమాజం



భవితకు పునాదులు వేయాలని మనమెన్నో అనుకుంటాము ఆయినా అవి నేరవేర్చుకునేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు .....
ఒక మేధావి చెప్పినట్లు మనము "కలలు కనాలి ఆ కలలను నిజం చేసుకోవాలి"  ఈ మాటలు అందరు ఆచరణలో పెట్టి ఉంటే భావి భారతంలో ఎందరో మోక్షగుండం విశ్వేశ్వరయ్య లు ఉండేవాళ్ళు ,,,,,,,
కాని మన సమాజంలో ఉన్న పరిస్థితుల ప్రకారం ఒక శతాబ్దికి ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య మాత్రమే పుడతాడు ఎందుకంటే ప్రతి పనిలోనూ అవినీతి అనేది ప్రత్యక్ష మహిషాసుర వేషంలో విలయతాండవం చేస్తోంది .....
                     ప్రజలలో ప్రతిదానికి భయాన్ని కలిగించే ఈ మహమ్మారిని ఏ దేవుడు వచ్చిన అంతం చేయలేడు ఎందుకంటే భగవంతుడికి కూడా లంచం ఇచ్చి కొనేయ్యాలనే అంతటి అవినీతి దుండగులు ఉన్నారు .....
ప్రతి మనిషిలోను మార్పు రావాలి మనమే మన సమాజాన్ని బంగారు బాటలో కాకపోయినా ముళ్ళ బాటలో మాత్రం నడవకుండా చేయాలని చిన్న విన్నపం నా విన్నప్పాన్ని మన్నిస్తారని ఆసిస్తూ ......
                                          అందరు కలకాలం సంతోషంగా  ఉండాలి...

Wednesday, September 29, 2010

Think once....మంచిమనసు

అందరిలో ఉండే ఆలోచనా జ్ఞానం రాను రాను నసించిపోతుందేమో అన్న సందేహం కలుగుతోంది ఎందుకంటే మానవుడికి భగవంతుడిచ్చిన అద్భుతమైన వరం క్షమించే గుణం.....
      ఒకరిని క్షమించే మనసులేని మనిషి తన జీవితాన్ని సార్ధకం చేసుకోలేడు ,,,,,
కనీసం మనిషిని మనిషిగా కూడా చూడలేకపోతున్న మన మా "నవసమాజం" లో ఎందరు దేవుళ్ళు దిగివచ్చినా మనలో పరివర్తన రాదు,,,,,,
                 ఎందుకంటే ఆ దేవుడు దిగివస్తే మనము అడిగే మొదటి ప్రశ్న "నువ్వు భగవంతుడని రుజువేంటి" అని .....

ఇది చదివే ప్రతి ఒక్కరికి నేను చేసే చిన్న విన్నపం ఒకటే మీరు అందరిని మార్చాల్సిన అవసరం లేదు మనలో ఉండే మంచిమనసుని వ్యక్తీకరించండి అంతే చాలు..


మనలోనే ఎందఱో మహానుభావులున్నారని ఆసిస్తూ మీ వెంకట్.....

Thursday, September 23, 2010

పదహారణాల తెలుగమ్మాయి

పదహారణాల తెలుగమ్మాయి....

కలువల్లాంటి కళ్ళు,
దొండపండులాంటి పెదవులు,
చేమంతుల్లాంటి చెక్కిలూ,
తుమ్మెద రెక్కల హోయల్లాంటి కురులు,
కళ్ళలో మెరిసే వెలుగు ఇంకా చురుకుదనం,
కొంచం సరదాగా,
మరికొంచెం సాంప్రదాయంగా,   కొంచం లక్షణంగా,

చాల గడుసుగా, చిలిపిగా.
అందంగా, ఆనందం మోమంత విరబూసి,
చెంగు చెంగున తుళ్ళుతూ, లంగావోని వేసుకుని వచ్చే.......
"16 అణాల తెలుగు అమ్మాయి" కి స్వాగతం

Wednesday, September 22, 2010

Andamina ammayi....

అందాన్ని ఆస్వాదించడానికి  ఎలాంటి ప్రత్యేకతలు ఉండాల్సిన అవసరం లేదని తెలియచేయడమే ఈ సందేసానుసారం
భాష తెలియని భావాలకు నిదర్శనం ఈ చిన్న దృశ్యం ...
సమ్మోహన రూపం ఉండటమే అమ్మాయిల అర్హత కాదు......
 ఆ అందాన్ని మరింత మనోహరంగా వర్ణించే హృదయం ఉండటమే అందం అదే ఆనందం...
చిన్ని కవితలకు మనసు పొంగితే అది పులకరింత ,,,,అది తెలియజేసే భాష భ్హవానికి అందని  మధురమైన  అనుభూతి ...

Thursday, August 19, 2010




                 ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా .....


                                       ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా ....


                                              నిను చూపినందుకు వెలుగుని ,,, 


                                                     నువ్వు పలికినందుకు తెలుగుని ,,,


                                                         నువ్వు నడిచినందుకు నేలని ,,, 


                                                                 నువ్వు పీల్చినందుకు గాలినీ ,,


                                                                         ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా ......


                                                                             ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా ......

Saturday, June 26, 2010

కవిత ....




ప్రతిసారి 


వాళ్ళు  నన్ను 
కవితలురాయమంటారు

వాళ్ళే  వర్ణాలు  అద్ది 
నా  అక్షరాలను 
దుకాణాలలో  అమ్ముకుంటారు 

శీర్షిక  కావచ్చు 
విషయం  కావచ్చు 
అంతా వాళ్ళ  ఇష్టమే 
బల్ల మీద  కాగితాలు 
ఎప్పుడు  చెల్లాచెదురుగా 
గాలికి  రేపరేపలాడుతుమ్తాయి 

నా  ఆకలికి  అవసరమైన 
ఆహారం 
నేనుమ్డాల్సిన  గది 
కూర్చోవాల్సిన  కుర్చీ 
అన్ని 
వాళ్ళే  నిర్ణిస్తారు 

రాజీ  పడలేని  మనసు 
వాళ్ళ  మాటలకు  కుదుర్చుకున్న 
ఒప్పందం
బాధ  కలిగిస్తున్నాయి 
పుట్టే  ప్రతి  ఆలోచన 
రాసే  ఒక్కో  వరుసా 
చివరికి 
వాళ్ళ  కోసం  రాసేవే 

అక్కడా  ఇక్కడా 
మార్పులు  చెప్పి 
నా  కవితలో 
వాళ్ళ  ముకాలను 
చూస్తున్నాను 

ఒక్కోసారి 
వాళ్ళ  అభిప్రాయాలకు 
నేను  జోడించే  మాటలు 
వసీకరమంత్రంగా 
ఎట్లా  పరవ్సిన్చిపోతున్నాయో 
తెలియడంలేదు 
నా  ఆసలు  భారమై 
పెను  నొప్పులతో 
లోటుపాట్లు  ఉన్న 
ఒక  ప్రపంచాలాగా 
మారిపోతునాయి 

అయిన 
వాళ్ళు  మాత్రం 
నా  సృష్టిని 
ఆహా   ఒహో 
సేహభ్ష్  అంటూ
సంబరాలు  చేసుకుంటున్నారు 

రాయడం  పూర్తియిన  తర్వాత 
కాగితాల్లో 
వెతుకుతున్నవే   కవితను , నన్నూ  
కానీ 
నేను  వాటిలో   కనిపించడంలేదు 
కొచం  ఆగండి 
వాళ్ళు  వస్తున్నారు 
నేను 
  • మల్లి  కవిత  రాయాలి ,,,,                                                .....మీ Venkat 

Saturday, June 12, 2010

Snehamaaaaaaa....











































నీకూ స్నేహితులున్నారా అని హృదయం అంటే
కన్ను కన్నీరు కారిస్తే
చేతి వేళ్ళు స్నేహితులై ఓదారిస్తె
అది పాపమా లేక అదృష్టమా?
ఐతే అది ఎవరిది ?
స్నేహాన్ని జ్ఞప్తికి తెచ్చిన హృదయానిదా (లేక)

స్నేహానికి విలువ నిచ్చిన నయనానిదా (లేక)

స్నేహితులై నయనాన్ని ఓదార్చిన చేతి వెళ్ళవా (లేక)
అద్భుతమైన ఈ జన్మనిచ్చిన మన తల్లితండ్రిలదా ?
......ఇలా ఇలా ఎన్నో ఎన్నెన్నో సరిగమల పదనిసలు ....
అందుకే ఈ జన్మలో తీపి స్మృతులను అందించిన గత వేసవి లాగే ఈ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొంగొత్త సరికొత్త ని అందరూ
ఆస్వాదించాలని , సెలయేళ్ళతో
చిలిపి ఊసుల సవ్వడులతో
వెన్నెల దారుల్లో ఊహల గాలుల్లో
ఆస్వాదిస్తూ చేసుకున్నా లేకున్నా
ఎప్పుడూ ఇలాగె ఎప్పటికీ నవ్వుతూ నవ్విస్తూ ఈ వసంతాన్ని ఆస్వాదిస్తూ ఎందరో మిత్రులను , ఆత్మీయులను సంపాదించాలని
నా మనసు ఆకాంక్షిస్తూ
ఏదో తన్మయత్వంలో
తెలిసీ తెలియని కవిత్వంతో
అక్షరాల ఆదుర్దాతో
మీకై ఇలా
" సరిక్రోత్చ పలుకుతూ "
సదా మీ నేస్తం ......... మీ ....;;;;;;;; 

Saturday, May 15, 2010

Its a feeling of a Loved one when they miss their love....

 
అటు  నువ్వే  ఇటు  నువ్వే ,
మనసు  ఎటు  చూస్తే  అటు  నువ్వే ,
ఎటు  వెళ్తున్నా  ఎమ్చేస్తున్నా   ప్రతిచోట  నువ్వే .
అటు  నువ్వే  ఇటు  నువ్వే  ,
అలికిడి  వింటే  అది  నువ్వే ,
అడమర్పైన   పెదవులపైన   ప్రతిమాట  నువ్వే .
అపుడు  ఇపుడు  ఎపుడైనా  ,
నా  చిరునవ్వే   నీవలనా ,
తెలియని  లోకం  తీపిని  నాకు  రుచి  చుపావులే .
ప్రచియం  అంతా  గతమేనా ,
గుర్తుకురాన  క్షణమైనా
ఎదురుగ  ఉన్నా  నిజమేకాని  కలవైనవులే


రంగు  రూపం  అంటూ  లేనేలేనిది  ఈ ప్రేమ  ,
చుట్టూ  శూన్యం  ఉన్నా  నిన్ను  చుపిస్తుఉంది .
దూరం  దగ్గర  అంటూ  తేడా  చూడదు  ఈ ప్రేమ  ,
నేల  చెంత  చేరి  నన్ను  మాటడిస్తుంది ,
కనుపాపలోతులో  దిగిపోయి  ఇంతలా
ఒక  రెప్పపాటు  కాలమైన  మరపే రావుగా .
ఎద  మారుమూలలొ  ఒదిగున్నాప్రాణమై  ,
నువ్వే  లేను  నేను  లేనే  లేను  అనిపించవుగా


నాకే  తెలియకుండా  నాలో  నిన్ను  వదిలావే
నేనే  నువ్వు  అయ్యేలా  ప్రేమ  గుణమై ఎదిగావే
మాటే  చెప్పకుండా  నీతో   నువ్వు   కదిలావే
ఇటుగా  చూడనట్టు  నను  ఒంటరిచేసావే
ఏకాంత వేళలో  ఈ  కాంతి  లేదురా
నలుసంతకూడా  జాలి  లేని  పంతాలు  ఏంటిలా
నీ  తోడులేనిదే  మన్సున్దలేదుర
నీ  పేరు  లేని ప్రేమనైన  ఉహించేదెల .

అటు  నువ్వే  ఇటు నువ్వే   మనసు  ఎటు చూస్తే అటు  నువ్వే
ఎటువెళ్తున్నా  ఏమ్చేస్తున్నా  ప్రతిచోటా  నువ్వే .

Tuesday, April 6, 2010

వేణువై   వచ్చాను  భువనానికి  
గాలినై పోతాను  గగనానికి "2" 
మమతలన్ని  మౌనగానం  
వాన్చలన్ని  వాయులీనం "వేణువై "

మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ

ఏడుకొండలకైన  బండతానోక్కటే
ఏడు   జన్మల  తీపి  ఈ  బంధమే  "2"
నీ  కంటిలో  నలతలో  వెలుగునే  కనక
నేను  నేననుకుంటే  ఎదచీకటే "హరి "
రాయినై వున్నాను  ఈ  నాటికి
రామపాదము  రాక  ఏ  నాటికి "వేణువై "

నీరు  కన్నీరాయె   ఊపిరే  బరువాయె  
నిప్పు  నిప్పుగా  మారే  నా  గుండెలో "2"
ఆ  నింగిలో  కలిసి  ఆ  శూన్యభందాలు  
పుట్టిల్లు  చేరే  మట్టి  ప్రాణాలు "హరి "
రెప్పనై   వున్నాను  నీ  కంటికి
పాపనై వస్తాను  మీ  ఇంటికి "వేణువై "





ఏడుకొండలకైన  బండ  తానోక్కటే
ఏడు  జన్మల  తీపి  ఈ  భంధమే  "2"

ఈ  చరణానికి  అర్ధం  తెలుపగలరు .

Monday, April 5, 2010

ఈ పదాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కాదు ఎందుకంటే ఇది నిత్యం మన చుట్టూ జరిగే సంఘటనలకు ప్రతిరూపమని  నా  ఉద్దేశం ....
 
ప్రతిచోట మనము ఎవరినయితే గౌరవించాలో వాళ్ళనే కించపరిచేలా ప్రవర్తిస్తున్నాం ఇది ప్రతి ఒక్కరు చేసేదని అందరికి తెలుసు కాని ఎవరు పట్టించుకోరు "ఎవరో 

వస్తారు ఏదో చేస్తారు" అని  ఎదురు చూడటంలో సమయం గడిచిపోతుందే కానీ జరిగేది ఏమి లేదు...

ఇది ఒకసారి ఆలోచించాలని అనుసరించాలని నా విన్నపం ఎందుకంటే నవ్యసమాజంలో ప్రతి స్త్రీ కి జరిగే అన్యాయాలు మనం రోజు చూస్తాం కానీ పట్టించుకోము 

ఎందుకంటే జరిగేది ఎక్కడో ఎవరికో అని చిన్న నిర్లక్ష్యం  ఇదే అన్నింటికీ ముఖ్యమైన కారణం....

"పురిటిలోనే ఆడపిల్లల్ని చంపే విష సంస్కృతి కి మనం అలవాటు పడిపోతున్నాం ,ఒకవేళ ఆ అమ్మాయి పుట్టినా చుట్టూ ఉన్న ఎంతోమంది విషపురుగుల వలన 

వాళ్ళు స్వతంత్రంగా ఉండటానికి ఎన్నో అవధులు పెడతారు అడుగడుగునా వాళ్ళు పడే కష్టాలు చూసి ఏమి చేయగలమో అది మనమే చేయాలి "

ముసలి తల్లితండ్రుల్ని వృద్ధాశ్రమం  లో  చేర్పించే అమానుష చేష్టలు మానివేయమని కోరుకుంటున్నాను ....

పుట్టిన నిమిషం నుంచి ప్రతి నిమిషాన్ని యమగండంగా గడిపే ప్రతి స్త్రీ మూర్తికి న్యాయం జరిగేలా చూద్దాం..మన చుట్టూ జరిగే అన్యాయాల్ని చూస్తూ ఉండకుండా 

మనకు ఎలా వీలుంటే అలా సహాయపడటానికి ప్రయత్నిద్దాం ప్రతి స్త్రీ లో మన అమ్మను ,చెల్లిని,స్నేహితురాలిని ,ఆప్తుల్ని చూడటమే మన కర్తవ్యం అని నా 

అభిప్రాయం ఇందులో ఏమైనా తప్పుంటే క్షమించండి అదేమీ లేదంటే నన్ను ఆదరిస్తారని ఆసిస్తూ ...మీ వెంకట్ 

Thursday, April 1, 2010

Anandam

కనులు తెరిచిన కనులు మూసిన ..........కలలు ఆగవేల
నిజము తెలిసిన కలని చెప్పిన మసను నమ్మదెల.......
ఎదుటే ఎపుడు తిరిగే వేలుగా......ఇదిగో ఇపుడే చూసా సరిగా...........
ఇన్నాలు నేన్నున్నది నడిరేయి నిదురలోన.....
అయితే నాకినాడే తొలిపొద్దు జాడ తెలిసిందే కొత్తగా............



పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పుసింది.....
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తుంది....
ఎందుకనో మది నీ కోసం ఆరాటం పెడుతుంది....
అయితేనే ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది...
దూరం మహా చెడ్డదని లోకం అనుకుంటుంది........
కాని ఆ దూరం నిన్ను దగ్గర చేసింది..........
నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది.............
నీతో అది చెప్పిందా.... నీ ఘపకలే నా ఊపిరైనవని

Thursday, March 11, 2010

Love heart...Don't hate Me..

మనసు నిప్పులా మారిపోతే ఈ మంటదేమి తప్పు ...
చేతులారా అంటిన్చుకున్నది గుండె ప్రేమ నిప్పు ....
మనసు నిప్పులా మారిపోతే ఈ మంటదేమి తప్పు ....
చేతులారా అంటిన్చుకున్నది గుండె ప్రేమ నిప్పు ...

..మనసా ఓ పిచ్చి  మనసా.....

తెలుసా నీ తప్పు నీకు తెలుసా

నీ తప్పు నీకు తెలుసా...

కలలనే కంటిని కల్లలనీ నా కనులు ఘోల్లుమన్నా
వలపులో ఉంటిని మైకమనీ నా గుండె మొత్తుకున్నా ...
పరువపు పెదవుల మెరుపులలోనా ఉనికి మరచిపోయా
అరె గంపెడు ఆశల గుండెలను నమ్మించి మోసగించా ...
మనసా...
ఓ పిచ్చి మనసా ...తెలుసా నీ తప్పు నీకు తెలుసా ...


చెమటనే పచ్చనినోట్లవలె నా తండ్రి నాకు ఇస్తే
కొలిచిన కోమలి ప్రేమాలకై జలసాగా ఖర్చ్చు చేశా..
చేతికందిన కొడుకునని మా అమ్మ నమ్ముకుంటే
ఒక బొమ్మకు మనసుని ఇచ్చుకుని మనిషిగా చచ్చిపోయా ...
మనసా ...ఓ పిచ్చి మనసా
నీ తప్పు నీకు తెలుసా...

Sunday, February 28, 2010

MAnaSu

మనసు - స్నేహం






నా కళ్ళు ఎప్పుడు

బరువుగా వుంటాయి

నీవి నన్ను

చుదకున్నప్పుడు

కన్నీళ్ళతో !





నా గొంతు

బొంగురుగా వుంటుంది

నీవి నాతో

మాటలడకున్నప్పుడు

బాధతో !





నా మనసు

ఆందోలనగా వుంటుంది

నీవు నా మనసులో

ఉన్నవని

తెలుపకున్నప్పుడు

వినయంతో !





నా జీవితం

వ్యర్దం అనిపిస్తుంది

నీవు నాతో కలసి

నడవకున్నప్పుడు

దురదృష్టంతో !

కలిసి స్నేహంగా ఉండాలని కోరుకునే

........మీ వెంకట్

Snehamaa...

సన్నిహిత నేస్తమా ....బంధుత్వం మించిన స్నేహమా ...!!


మౌనం వహించేది మాటలు చెప్పలేక కాదులే ..!!

పలుకుల ప్రయాణం .సాగే ఆత్మీయతాబాట వెతుకుతూ ...!!



స్నేహమనే పూల బాట పడుతున్న ఈ చిరు సమయంలో ...!

మౌనం అనే చిన్న ఎడబాటు ..దూరాలు తెలుపదులే ..!!

మరిచిపోని అనుభందంలో సాగే జీవన స్మృతులు కలుపుతూ ..!!